E-Paper
Advertisement

ఆ తేదీలో పుట్టిన వారు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారట – ఏ తేదీనో తెలుసా..?

ఆ తేదీలో పుట్టిన వారు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారట – ఏ తేదీనో తెలుసా..?
Advertisement

Power to Influence: ఆ తేదీలో పుట్టిన వారు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటారట. వాళ్లు ఏం చెప్పినా ఇతరులు కాదనకుండా వింటారట. ఎంత మందినైనా మెస్మరైజ్‌ చేయడం  ఆ తేదీలో పుట్టిన వారికి వెన్నతో పెట్టిన విద్య లాంటిదట. మరి ఆ తేదీ ఏంటో… వాళ్లు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారో ఈ కథనంలో తెలుసుకుందాం.

సంఖ్యా శాస్త్రం (Numerology) ప్రకారం, ఏ నెలలోనైనా 11వ తేదీన జన్మించిన వారు మాస్టర్ నంబర్ 11 ప్రభావంతో ఉంటారట. వీరి జీవితం సాధారణంగా ఎత్తుపల్లాలతో కూడి ఉన్నా, ఆధ్యాత్మికంగా మరియు మేధోపరంగా చాలా ఉన్నత స్థితిలో ఉంటుందట

Advertisement

వ్యక్తిత్వం మరియు స్వభావం: 11వ తేదీన పుట్టిన వారు అత్యంత సున్నిత మనస్కులు మరియు తెలివైన వారట. వీరికి ఊహాతీతమైన అంతర్జ్ఞానం (Intuition) ఉంటుందట. ఎదుటివారి మనసులో ఏముందో ముందే పసిగట్టే శక్తి వీరికి ఉంటుందట.  వీరు ఇతరులను ప్రభావితం చేయగల శక్తిని కలిగి ఉంటారట అంటే పెద్ద నాయకులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందట. వీరి ఆలోచనా విధానం ఎప్పుడూ కొత్తగా ఉంటుందట.  అలాగే కొత్త విషయాలను అన్వేషించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుందట. అయితే పదకొండే తేదీలో పుట్టిన వారు చిన్న చిన్న విషయాలకే త్వరగా హర్ట్ అవుతుంటారట కానీ బయటకు మాత్రం ప్రశాంతంగా కనిపిస్తారట.

కెరీర్ మరియు ఆర్థిక స్థితి (Settlement): 11వ తేదీలో పుట్టిన వారు సృజనాత్మకత (Creativity) మరియు మేధస్సుకు సంబంధించిన రంగాల్లో బాగా రాణిస్తారట. ముఖ్యంగా కళలు మరియు మీడియా రైటర్స్, ఆర్టిస్టులు, సినిమా రంగానికి చెందిన పనుల్లో మంచి పేరు సంపాదిస్తారట. అలాగే  మంచి వక్తలుగా, మోటివేషనల్ స్పీకర్లుగా లేదా సైకాలజిస్టులుగా పేరు సంపాదిస్తారట. ఇంకా మార్కెటింగ్ మరియు ప్రమోషన్స్ రంగాల్లో వీరి ఐడియాలు అద్భుతంగా పనిచేస్తాయట. మతపరమైన లేదా ఆధ్యాత్మిక సంస్థల్లో కీలక పాత్రలు పోషిస్తారట.

Advertisement

జీవితం మలుపు తిరిగే వయసు (Turning Point): 11వ తేదీన పుట్టిన వారికి జీవితంలో ప్రధానమైన మార్పులు మరియు స్థిరత్వం సాధారణంగా 25 నుంచి 28 ఏళ్ల మధ్యలో కెరీర్ విషయంలో ఒక స్పష్టత వస్తుందట. అలాగే 38 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఆర్థికంగా మరియు సామాజికంగా అత్యున్నత స్థాయికి చేరుకుంటారట. ఇది వీరి జీవితంలో గోల్డెన్ పీరియడ్‌గా చెప్పవచ్చని పండితులు అంటున్నారు.

భవిష్యత్తు ఎలా ఉంటుంది?: వీరి భవిష్యత్తు చాలా వరకు వీరి ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుందట. వీరి వైవాహిక జీవితంలో  భాగస్వామి పట్ల చాలా ప్రేమానురాగాలు కలిగి ఉంటారట. ఒకరినొకరు గౌరవించుకునే వాతావరణం ఉంటే వీరి సంసార జీవితం చాలా అద్భుతంగా ఉంటుందట. వీరికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి, రెండు, ఏడు. అదృష్ట రంగులు తెలుపు, లేత పసుపు, ఆకుపచ్చ రంగులట.

అయితే 11 వ తేదీన పుట్టిన వారు ఎక్కువగా మానసిక ఒత్తిడికి (Stress) గురయ్యే అవకాశం ఉంటుందట. కాబట్టి క్రమం తప్పకుండా ధ్యానం (Meditation) చేయడం వల్ల మనశ్శాంతిని పొందవచ్చని పండితులు సూచిస్తున్నారు. మీలోని సృజనాత్మకతను సరైన దిశలో ఉపయోగిస్తే సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఈ చిన్న రెమెడీస్ పాటిస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×