E-Paper
Advertisement

బేకరీ ఫుడ్ తింటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!

బేకరీ ఫుడ్ తింటున్నారా.. అయితే మీరు ఇది తెలుసుకోవాల్సిందే..!
Advertisement

Adulterated Food: స్వేచ్ఛ బ్యూరో: కల్తీ.. నాసిరకం ముడి పదార్థాలతో అత్యంత అపరిశుభ్ర వాతావరణలో పదార్థాలు తయారు చేసి అమ్ముతున్న బేకరీ యజమానిని గోల్కొండ టాస్క్​ ఫోర్స్​ అధికారులు టప్పాఛబుత్రా పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. అతని షాపు నుంచి 2.77లక్షల విలువ చేసే తినుబండారాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్​ ఫోర్స్​ అదనపు డీసీపీ అందె శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫ్​ నగర్​ అంబేద్కర్​ నగర్​ కాలనీ నివాసి సయ్యద్ ఖదీర్​ (42) జిర్రా ప్రాంతంలో చాంద్​ బేకరీ నడుపుతున్నాడు.

Also Read: Vivo V70 FE అరాచకం.. చీకట్లో మెరుస్తుంది, నీటిలోనూ ఫొటోలు తీస్తుంది, కెమెరా పిచ్చ క్లారిటీ బ్రో!

తేలికగా డబ్బు కోసం..

Advertisement

అయితే, తేలికగా డబ్బు సంపాదించటానికి కల్తీ, నాసిరకం ముడి పదార్థాలతో ఆహార పదార్థాలు తయారు చేసి అమ్ముతున్నాడు. దాంతోపాటు కిరాణా షాపులు, కేఫ్​ లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్​ ఫోర్స్​ సీఐ వెంకటేశ్, టప్పాఛబుత్రా సీఐ బాలకృష్ణ, ఎస్ఐలు వెంకటరమణ, అంజద్​ షరీఫ్​ తోపాటు సిబ్బందితో కలిసి బేకరీపై దాడి చేశారు. తనిఖీలు జరిపి 550 కిలోల మైదా, ఆరు కాటూన్ల సాస్​, 23 కాటూన్ల డాల్డా, 150 కిలోల చక్కెర, 25 కిలోల కొబ్బరి పొడి, 160 కిలోల కేక్​ పౌడర్, 60 కిలోల నూనె, 8 కిలోల చికెన్​, 84 బ్రెడ్​ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై టప్పాఛబుత్రా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఆ జిల్లాలో భారీగా అంగన్‌వాడీ పోస్టులు.. టెన్త్ పాసైతే చాలు.. ఉద్యోగం వచ్చేస్తది!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×