E-Paper
Advertisement

Viral Video: కన్ఫార్మ్ టికెట్ ఉన్నా, కష్టాలు తప్పలేదు.. మరీ ఇంత ఘోరమా?

Viral Video: కన్ఫార్మ్ టికెట్ ఉన్నా, కష్టాలు తప్పలేదు.. మరీ ఇంత ఘోరమా?

Indian Railway Viral Video: ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని రైల్వేశాఖ చెప్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. కన్ఫార్మ్ టికెట్ తో రైలు ఎక్కినా, కష్టాలు తప్పడం లేదంటూ ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి రైల్వే ఎదురైన ఇబ్బంది గురించి షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే?

తాజాగా ఓ యువతి S3 కోచ్ లో సీటు బుక్ చేసుకుంది. రైలు ఎక్కింది. స్లీపర్ కోచ్ లో చక్కగా ప్రయాణం చెయ్యొచ్చు అనుకుంది. కానీ, పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆమె తన బోర్డింగ్ స్టేషన్ లో రైలు ఎక్కగానే అప్పటికే ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఎలాగోలా తన బెర్త్ దగ్గరికి వెళ్లి కూర్చుంది. ఆ తర్వాతే అసలు కథ మొదలయ్యింది. రైలు ముందుకు వెళ్తున్నా కొద్దీ జనాలు వచ్చేస్తున్నారు. కాసేపట్లోనే కోచ్ అంతా కిక్కిరిసిపోయింది. కనీసం కాలు పెట్టేందుకు కూడా స్థలం లేని విధంగా మారిపోయింది.

వాష్ రూమ్ కు వెళ్లే పరిస్థితి లేక…

సదరు కోచ్ లో పరిస్థితిని ఈ వీడియోలో యువతి వివరించే ప్రయత్నం చేసింది. కన్ఫార్మ్ టికెట్ ఉనప్పటికీ తాను ఓ మూలకు కూర్చోవాల్చి వచ్చిందని చెప్పింది. కనీసం ఊపిరి ఆడే పరిస్థితి లేదని చెప్పింది. కనీసం వాష్ రూమ్ కు కూడా వెళ్లే అవకాశం లేదని వెల్లడించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.  టికెట్ కోసం డబ్బులు చెల్లించినప్పుడు, ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు, భద్రత కూడా రైల్వే అధికారులు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించింది. ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తామని చెప్తున్న రైల్వే అధికారులు, ఈ పరిస్థితి పట్లల ఏం సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also: హోలీ వేళ రైల్వే గుడ్ న్యూస్, మహబూబ్‌నగర్ సర్వీస్ పొడిగింపు!

సోషల్ మీడియాలో వీడియో వైరల్

అటు ఈ ఘటన ఏ రైల్లో జరిగింది అనేది కచ్చితంగా తెలియదు. కానీ, సదరు యువతి తమిళంలో మాట్లాడుతున్న నేపథ్యంలో తమిళనాడు పరిసర ప్రాంతాల్లో జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. అటు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రైల్వేకు డబ్బులు వస్తే చాలు, ప్రయాణీకులు ఎలా పోయినా పట్టించుకోరని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ లేని వారికి జరిమానా విధించే రైల్వే అధికారులు, టికెట్ ఉన్న ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించలేనప్పుడు ప్రయాణీకులకు ఎంత చెల్లిస్తారో చెప్పాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read Also: హైవే vs ఎక్స్‌ ప్రెస్‌ వే.. రెండింటి మధ్య ఇంత తేడా ఉందా?

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×