E-Paper
Advertisement

Chinese Horoscope: చైనా రాశిఫలాలు.. మీరు ఆ ఏడాదిలో పుట్టి ఉంటే డబ్బే డబ్బు, 2026లో మీకు తిరుగే ఉండదు!

Chinese Horoscope: చైనా రాశిఫలాలు.. మీరు ఆ ఏడాదిలో పుట్టి ఉంటే డబ్బే డబ్బు, 2026లో మీకు తిరుగే ఉండదు!
Advertisement

Chinese Horoscope 2026 for Indians: భారతీయుల తరహాలోనే చైనీయులు రాశిఫలాలు నమ్ముతారు. అయితే, వీరి రాశులు, చిహ్నాలు చాలా భిన్నంగా ఉంటాయి. చైనా వారు తమ రాశులను జంతువులతో పోల్చుతారు. ఇండియాలో పుట్టిన తేదీ ప్రకారం.. నక్షత్రాలు, రాశులు డిసైడ్ చేస్తారు. అయితే, చైనాలో పుట్టిన ఏడాదినే రాశిగా పరిగణిస్తారు. తెలుగువారికి ఉగాది పండుగ ఎలాగో.. చైనావారికి కూడా ప్రత్యేకంగా ఒక సంవత్సరం ఉంటుంది. అయితే, మనమంతా ఇంగ్లీష్ ఇయర్ తేదీలను ‘డేట్ ఆఫ్ బర్త్‌’గా చెప్పుకుంటాం. కానీ, రాశులు.. నక్షత్రాలు మాత్రం పంచాంగానికి తగినట్లుగానే ఉంటాయి.

చైనా రాశిఫలాలు ఎలా ఉంటాయి?

⦿ చైనాలో రోజువారి, నెలవారీ రాశిఫలాలు అంటూ ఏమీ ఉండవు. కొత్త ఏడాది రాగానే.. వారి ‘యానిమల్’ జాతకాన్ని చెక్ చేసుకుంటారు. మనం రాశులను ఎలా చెక్ చేసుకుంటామో.. వారు అలా జంతువులను చెక్ చేసుకుంటారు. అవే వారి రాశి చిహ్నాలు.

Advertisement

⦿ అయితే, చైనా న్యూ ఇయర్ జనవరిలో మొదలు కాదు. జనవరి ఎండింగ్, ఫ్రిబ్రవరి స్టార్టింగ్‌లో మొదలవుతుంది. ఉదాహరణకు మీరు 01.01.2000 సంవత్సరంలో పుట్టి ఉంటే.. మీరు 1999కి చెందిన జంతువే మీ రాశి.

⦿ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే.. మీరు 05.02.2000 (ఆ ఏడాది చైనా న్యూ ఇయర్ తేది) తర్వాత పుట్టినట్లయితే.. మీ రాశి ‘డ్రాగన్’. ఆ తేదీ కంటే ముందు పుడితే.. 1999 సంవత్సరానికి చెందిన ‘కుందేలు’ మీ రాశి అవుతుంది.

Advertisement

⦿ 2026లో చైనా న్యూ ఇయర్ ఫిబ్రవరి 17న వస్తుంది. ఈ ఏడాదిలో ఫిబ్రవరి 16 తర్వాతి తేదీల్లో పుట్టినవారి రాశి ‘గుర్రం’ అవుతుంది. ఈ ఏడాది ‘ఇయర్ ఆఫ్ ది హార్స్’ రానుంది. అంటే ఈ ఏడాదిలో పుట్టినవారి అందరి రాశి గుర్రం కానుంది.

⦿ ప్రతి రాశి 12 ఏళ్లకు ఒకసారి మారుతుంది. అంటే ఈ ఏడాది గుర్రం వస్తే.. 2027లో ‘మేక’ వస్తుంది. గత ఏడాది(2025) పుట్టినవారిది పాము. ఇలా ప్రతి ఏడాది మారుతుంది. 12 ఏళ్లకు ఒకసారి మారుతుంది. ఉదాహరణకు ఈ ఏడాది ఇయర్ ఆఫ్ ది యానిమల్.. గుర్రం. మళ్లీ ఇది 12 ఏళ్ల తర్వాత.. అంటే 2038లో వస్తుంది.

ఇయర్ ఆఫ్ ది యానిమల్‌ కీలకం

ప్రతి ఒక్కరి జీవితం ‘ఇయర్ ఆఫ్ ది యానిమల్’ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు పుట్టిన ఏడాది గుర్రం అనుకోండి. ‘ఇయర్ ఆఫ్ ది యానిమల్’ ఎలుక వచ్చిందనుకోండి.. ఆ ఏడాది అంతా మీకు సమస్యలే ఉంటాయి. అంటే ఇండియాలో పెళ్లికి ముందు చూసుకొనే జాతకాల లెక్క. జంతువుల మధ్య కూడా సయోధ్య ఉండాలి. లేకపోతే ఆ ఏడాది మొత్తం కష్టలే. అయితే, ఇయర్ ఆఫ్ యానిమల్‌ రాశిలో ఉన్నవారికి మాత్రం ఆ ఏడాది మొత్తం మంచే జరుగుతుందని చైనావాళ్లు నమ్ముతారు.

ఎలా చెక్ చేసుకోవాలి?

మీరు పుట్టిన ఏడాది, నెల మీకు తెలిస్తే చాలు. దాని బట్టి మీరు జంతువుకు చెందినవారో తెలుస్తుంది. మీకు ఇక్కడ కొన్ని రీసెంట్ ఇయర్స్‌, ఆ ఏడాదికి చెందిన జంతువుల వివరాలను ఇచ్చాం. దాన్ని బట్టి మీ రాశి ఏదో తెలుసుకోండి. ఈ ఏడాది ఆ రాశుల ప్రభావం ఎలా ఉందో చూడండి.

1. ఎలుక (Rat) – 1984, 1996, 2008, 2020:

నోట్ – 2020కు 12 యాడ్ చేస్తే.. మళ్లీ ఎలుక ‘ఇయర్ ఆఫ్ ది యానిమల్’ సంవత్సరం వస్తుంది.
2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?

కెరీర్: సమస్యలు తప్పవు
సంపాదన: చాలా కష్టం
ప్రేమ: ఆశించినంత దక్కదు
ఆరోగ్యం: దారుణంగా ఉంటుంది.
ఇతర ఫలితాలు: ఈ ఏడాది ‘ఇయర్ ఆఫ్ ది యానిమల్’ అయిన గుర్రానికి, ఎలుకకు అస్సలు పడదు. కాబట్టి, ఈ రాశులవారికి సమస్యలు ఎక్కువ. వీరు చాలా శాంతంగా ఉండాలి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.

2. ఎద్దు (OX) – 1985, 1997, 2009, 2021

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగుంటుంది
సంపాదన: బాగుంటుంది
ప్రేమ:  పర్వాలేదు
ఆరోగ్యం:  బాగుంటుంది
ఇతర ఫలితాలు: ఈ రాశివారికి సంవత్సరం మొత్తం బాగుంటుంది. కేరీర్, సంపద అన్నీ బాగుంటాయి. అయితే, కుటుంబికులు, బయట వ్యక్తులతో చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. వాటికి జాగ్రత్తగా ఉండాలి.

3. పులి (Tiger) – 1986, 1998, 2010, 2022

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగోదు
సంపాదన: అంతంత మాత్రం
ప్రేమ: పర్వాలేదు
ఆరోగ్యం: చాలా జాగ్రత్తగా ఉండాలి
ఇతర ఫలితాలు: ఈ రాశి వారికి కుటుంబికులు, స్నేహితుల నుంచి ప్రేమాభిమానులు పుష్కలంగా లభిస్తాయి. కానీ, జీవితానికి అవసరమైన కెరీర్, సంపాదన మాత్రమే అంతంత మాత్రంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

4. కుందేలు (Rabbit) -1987, 1999, 2011, 2023

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: అద్భుతం
సంపాదన: సూపర్
ప్రేమ: సూపర్
ఆరోగ్యం: బాగుంటుంది
ఇతర ఫలితాలు: ఈ రాశివారు 2026లో కింగ్స్ అనే చెప్పుకోవాలి. వీళ్లు ఎక్కడ ఉంటారో.. లక్ అక్కడ ఉంటుంది.

5. డ్రాగన్ (Dragon) -1988, 2000, 2012, 2024

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: కాస్త పర్వాలేదు
సంపాదన: బాగోదు
ప్రేమ: కాస్త పర్వాలేదు
ఆరోగ్యం: పర్వాలేదు
ఇతర ఫలితాలు: పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. రిస్కీ ఇన్వెస్టెమెంట్లు వద్దు. నిదానమే ప్రధానం అన్నట్లుగా సాగాలి.

6. పాము (Snake) – 1989, 2001, 2013, 2025

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: పర్వాలేదు, కష్టపడితేనే ఫలితం
సంపాదన: కాస్త పర్వాలేదు, కష్టపడాలి
ప్రేమ: పర్వాలేదు
ఆరోగ్యం: బాగాలేదు
ఇతర ఫలితాలు: గాసిప్స్‌కు దూరంగా ఉండండి. లేనిపోని చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం.

7. గుర్రం (Horse) – 1990, 2002, 2014, 2026 (ప్రస్తుతం)

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగుంది
సంపాదన: పర్వాలేదు, నష్టాలు ఉండవు
ప్రేమ: అంతంత మాత్రమే
ఆరోగ్యం: అంతంత మాత్రమే
ఇతర ఫలితాలు: ఈ ఏడాది కెరీర్ మెరుగయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. కానీ, ప్రేమాభిమానులు దక్కడం కష్టం. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం.

8. మేక (Goat) – 1991, 2003, 2015, 2027

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: సూపర్
సంపాదన: అద్భుతం
ప్రేమ: బోలెడంత లభిస్తుంది
ఆరోగ్యం: బాగుంటుంది
ఇతర ఫలితాలు: ఈ రాశివారికి ఏడాది మొత్తం కెరీర్ సాఫీగా నడుస్తుంది. సంపాదన కూడా బాగుంటుంది.

9. కోతి (Monkey) – 1992, 2004, 2016, 2028

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగోలేదు
సంపాదన: బాగోలేదు
ప్రేమ: బాగోలేదు
ఆరోగ్యం: పర్వాలేదు
ఇతర ఫలితాలు: ఈ రాశివారికి అన్నీ కష్టాలే. కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టాలి.

10. కోడి పుంజు (Rooster) – 1981, 1993, 2005, 2017

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగుంటుంది
సంపాదన: బాగుంటుంది
ప్రేమ: బోలెడంత లభిస్తుంది
ఆరోగ్యం: బాగుంటుంది
ఇతర ఫలితాలు: ఈ రాశివారికి కూడా ఈ ఏడాది బాగుంటుంది. కెరీర్ సాఫీగా సాగుతుంది. ఆర్థికంగానూ బాగుంటుంది.

11. కుక్క (Dog) 1982, 1994, 2006, 2018

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: అద్భుతం
సంపాదన: బాగుంటుంది
ప్రేమ: బోలెడంత లభిస్తుంది
ఆరోగ్యం: అంతగా బాగోదు
ఇతర ఫలితాలు: ఈ రాశివారి కెరీర్ సాఫీగా సాగుతుంది. సంపాదన కూడా వారు పడే కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

12. పంది (Pig) – 1983, 1995, 2007, 2019

2026లో ఈ రాశికి ఎలా ఉండనుందంటే?
కెరీర్: బాగుంటుంది
సంపాదన: బాగుంటుంది
ప్రేమ: బాగుంటుంది
ఆరోగ్యం: బాగోదు
ఇతర ఫలితాలు: తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. దానివల్ల ఆరోగ్యం చెడిపోయే అవకాశాలున్నాయి.. జాగ్రత్త.

Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్.. శంషాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదా? తేడా ఏమిటీ?

Tags

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×