Tirumala annaprasadam: తిరుమలలో ఫస్ట్ టైం అన్నదానం చేసింది ఎవరో తెలుసా..? స్వామి వారి భక్తుల ఆకలి తీర్చింది ఎవరో..? తెలుసా..? ఎంత కష్టంతో కూడిన వచ్చిన భక్తులకు వచ్చినట్టే అన్న పెట్టి ఎంతో పుణ్యం మూటకట్టుకున్నదెవరో తెలుసా..? అలా అన్నదానం చేసిన వ్యక్తికి స్వామి వారు ఇచ్చిన అద్బుతమైన వరం ఏంటో తెలుసా..? ఇప్పటికీ ఆ వ్యక్తి స్వామి వారిని దర్శించుకుంటారంటే మీరు నమ్ముతారా..? కానీ అప్పుడప్పుడు ఆ వ్యక్తి స్వామి వారిని దర్శించుకుంటారని ఆలయ అర్చకులే చెప్తుంటారు. ఇంతకీ మొదట అన్నదానం చేసింది ఎవరో..? ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే ఇప్పుడు కడుపునిండా పంచభక్ష్య పరమాన్నాలు తినొచ్చు. ఇప్పుడు తిరుమల వెళ్తే తినడానికి ఉండటానికి ఎటువంటి లోటు ఉండదు. కానీ రోజుకు వేల మంది వెళ్లినా అన్ని రకాల వసతులు అందుబాటులో ఉంటాయి. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందట తిరుమలలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కావట. స్వామి వారి దర్శనానికి వెళ్లిన భక్తులకు అన్ని ఇబ్బందులే ఎదురయ్యేవట. అయినా భక్తులు స్వామి వారి మీద ఉన్న భక్తితో సౌకర్యాల గురించి ఆలోచించకుండా స్వామి దర్శనానికి వెళ్తుండేవారట.
అయితే అప్పట్లోనే స్వామి వారి భక్తులు కష్టాలు చూసి చలించిపోయారట. తరిగొండ వెంగమాంబ. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాగైనా ఆకలి తీర్చాలని సంకల్పించారట. కొండపైకి వచ్చే భక్తులు ఆకలితో అలమటించకూడదని భావించిన ఆమె 18వ శతాబ్దంలోనే అన్నదాన సేవను ప్రారంభించారట. దీంతో ఆమె తనకున్న దానిలోనే ఎంతో కష్టపడి వచ్చిన ప్రతి ఒక్క భక్తుని ఆకలి తీర్చేవారట. తన నివాసం (ప్రస్తుతం ఉత్తర మాడ వీధిలో ఉంది. వరాహ స్వామి దేవాలయం ఎదురుగా) వద్ద భక్తులకు నిరంతరం అన్నప్రసాదాన్ని పంచేవారట. దీంతో తిరుమలలో స్వామి వారి భక్తులకు మొదటిసారి అన్నదానం చేసిన వ్యక్తిగా తరిగొండ వెంగమాంబ గారు చరిత్రలో నిలిచిపోయారు. అన్నదానం చేస్తుండటంలో భక్తులు ఆమెను ప్రేమగా, గౌరవంగా ‘వెంగమాంబ అవ్వ’ అని పిలుచుకునేవారట. ఆమె శ్రీవారిపై ఉన్న అచంచల భక్తికి, తిరుమలలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గాను చరిత్రలో నిలిచిపోయారు.
తరిగొండ వెంగమాంబ ప్రారంభించిన ఈ సేవ నుండే స్ఫూర్తి పొంది నేడు టీటీడీ (TTD) ప్రతిరోజూ లక్షలాది మందికి ‘నిత్య అన్నదాన పథకం’ ద్వారా భోజనం పెడుతోంది. వెంగమాంబ చేసిన సేవకు గుర్తుగా, టీటీడీ వారు తిరుమలలో నిర్మించిన భారీ అన్నదాన భవనానికి “మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం” అని పేరు పెట్టారు. ఇక్కడ ప్రతిరోజూ వేల మంది భక్తులు ఉచితంగా భోజనం చేస్తారు. అందుకే ఆమెను ‘అన్నదాన సేవకు తల్లి’గా భావిస్తారు.
వెంగమాంబ హారతి (ముత్యాల హారతి) వెంగమాంబ భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆమెకు ఒక వరం ఇచ్చారని చెబుతారు. ప్రతిరోజూ రాత్రి స్వామి వారి ఆలయ తలుపులు మూసే ముందు (ఏకాంత సేవ తర్వాత), వెంగమాంబ ఇచ్చే హారతినే స్వామి వారు స్వీకరిస్తారట. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. వెంగమాంబ వంశీయులు ప్రతిరోజూ రాత్రి ముత్యాల హారతి ఇస్తారు. దీనినే ‘వెంగమాంబ హారతి’ అంటారు. దీన్ని బట్టి ఇప్పటికీ వెంగమాండ స్వామి వారిని దర్శించుకుంటూనే ఉందని అర్థం.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.