E-Paper
Advertisement

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!

GHMC Commissioner: బదిలీ అయిన చోటకు వెళ్లాల్సిందే.. టెలీ కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆదేశాలు!
Advertisement

GHMC Commissioner: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా ఇటీవలే రూపాంతరం చెందిన జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ, ప్రక్షాళనలో భాగంగా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ వివిధ విభాగాల వారీగా నియామకాలు, బదిలీలు, అర్హత కల్గిన ఉద్యోగులకు పదోన్నతులను కల్పిస్తూ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల్లో భాగంగా వేలాది మంది ఔట్ సోర్స్ కార్మికులకు స్థానచలనం కల్గిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ జారీ చేసిన ఆదేశాలు ప్రధాన కార్యాలయం ఉద్యోగుల విషయంలో అమలు కాకపోవటంపై స్వేచ్ఛ ఈ నెల 7వ తేదీన ‘తప్పుుదోవపట్టించారా?’ అన్న శీర్షికతో వచ్చిన కథనానికి కమిషనర్ కర్ణన్  సీరియస్ గా స్పందించారు.

Also Read: Nizamabad BJP: నిజామాబాద్ అర్బన్‌లో బీజేపీ వ్యూహం మారిందా? మేయర్ సీటుకు కొత్త ట్విస్ట్!

బదిలీ అయిన చోటే విధులు నిర్వర్తించాలి 

Advertisement

తాను జారీ చేసిన ఆదేశాలను పాటిస్తూ, ఆ ఆదేశాల ప్రకారం బదిలీ అయిన చోటే విధులు నిర్వర్తించాలని, ఈ ఆదేశాలను పాటించని ఔట్ సోర్స్ ఉద్యోగులను విధి నిర్వహణ నుంచి తొలగించాలని సోమవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆయన ఆదేశాలు ప్రధాన కార్యాలయంలో అమలు కావటం లేదని, వివిధ విభాగాల్లో ఏళ్లుగా తిష్ట వేసిన కొందరు ఔట్ సోర్స్ ఉద్యోగులు తాజాగా బదిలీల నుంచి మినహాయింపు కోరుతూ హెచ్ఓడీల వద్ద చేస్తున్న పైరవీలు, బదిలీల కోసం కమిషనర్ అడిగిన సమాచారాన్ని ఏజెన్సీలు కొంత మంది ఉద్యోగుల పేర్లను తప్పించి పంపిన వ్యవహారాన్ని ఈ కథనంతో స్వేచ్ఛ వెలుగులోకి తెచ్చింది. ఔట్ సోర్స్ ఉద్యోగుల బదిలీ విషయంలో ఆదేశాలు అమలు కాకుండా, బదిలీ అయిన చోటకు ఔట్ సోర్స్ సిబ్బంది వెళ్లి, విధులు నిర్వర్తించకుండా అడ్డుకునే విభాగాధిపతులను ట్రాన్స్ ఫర్ చేయనున్నట్లు ఆయన కాన్ఫరెన్స్ లో తీవ్ర అసహనాన్ని వక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

Also ReadShivaratri: శివరాత్రి తర్వాత లక్ష్మీ నారాయణ యోగం – ఆ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమేనట

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×