Ugadi panchangam 2026: విశ్వావసు నామ సంవత్సరం 2026 ఉగాది నుంచి కర్కాటక రాశి వారికి గురు, శని గ్రహాల ప్రభావంతో ఊహించని అభివృద్ది జరుగుతుందట. ఈ సంవత్సరం ఈ రాశి జాతకులు అష్టమ శని పీడ నుంచి విముక్తి అవుతారట. దీని వల్లన భాగ్య స్థానంలో శని సంచారం వల్ల ఇన్ని రోజులు పడిన కష్టాలకు ముగింపు రానుందట. వీరికి ఈ సంవత్సరం అదృష్టం ప్రారంభం అవుతుందని. దీని వల్ల కెరీర్ పరంగా ఆర్థికపరమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్థిరత్వం ఏర్పడుతుందట. కానీ కొన్ని కుటుంబ బాధ్యతలు పెరగవచ్చని పండితులు సూచిస్తున్నారు. వివాహ జీవితానికి.. వృత్తిపరమైన జీవితానికి ఈ సంవత్సరం అనుకూలమైన సమయంగా చెప్తున్నారు పండితులు.
ఇక ఈ రాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమాన 7గా ఉంది. ఈ రాశిలోకి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం హి అనే అక్షరంతో పేరు మొదలవుతున్నవారు.. అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు.. హు, హె, హో, డా అనే అక్షరాలతో పేర్లు మొదలవుతున్నవారు.. ఇక ఆశ్లేష నక్షత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగు పాదాలు.. డి, డూ, డే, డో అనే అక్షరాలతో పేర్లు మొదలవుతున్న వాళ్లు ఈ రాశిలోకి వస్తారు.
ఈ పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశి వారికి జీవితంలో పురోగతి లభిస్తుంది. లైఫ్‌లో స్థిరత్వం ఏర్పడుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రమోషన్లు ఈ సంవత్సరం వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అద్బుతమైన విదేశీ యోగం ఉంది. ఇక ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా విజయం వరిస్తుంది.
ఈ రాశి జాతకులకు ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు వ్యయంలో ఉన్నందు వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఎంత వీలైత అంత ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఇక సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు.
ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆనారోగ్యపరమైన సమస్యలు తీరిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు ఎదుర్కొంటున్న వారు ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే తీర్థయార్థలు కూడా చేస్తారు.
ఈ సంవత్సరం మరింత మంచి ఫలితాల కోసం ఈ రాశి వారు సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. పేద విద్యార్థులకు పుస్తకాలు పంచాలి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.