E-Paper
Advertisement

Copper vessel: పూజగదిలోని రాగి చెంబు విషయంలో ఆ తప్పు అసలు చేయకండి

Copper vessel: పూజగదిలోని రాగి చెంబు విషయంలో ఆ తప్పు అసలు చేయకండి
Advertisement

Copper vessel: పూజగదిలో రాగి చెంబు (కలశం) ఉంచడం వెనుక బలమైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మన పూర్వీకులు ప్రతి ఆచారాన్ని ఆరోగ్యం మరియు సానుకూల శక్తిని దృష్టిలో ఉంచుకునే కొన్ని ఏర్పాట్లు చేశారు. అయితే రాగి చెంబును పూజగదిలో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో.. రాగి చెంబు విషయంలో ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

సానుకూల శక్తిని ఆకర్షించడం (Energy Absorption): రాగికి విద్యుత్ మరియు శక్తిని గ్రహించే గుణం ఎక్కువగా ఉంటుందట. పూజగదిలో మంత్రాల పఠనం, ధూప దీప నైవేద్యాలు జరిగినప్పుడు అక్కడ ఒక రకమైన సానుకూల తరంగాలు (Positive Vibrations) ఏర్పడతాయట. రాగి పాత్ర ఆ శక్తిని గ్రహించి పూజగది అంతా ప్రసరింపజేస్తుందట.

Advertisement

తీర్థం యొక్క ప్రాముఖ్యత (Scientific Reason): రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల ఆ నీరు తామ్ర జలంగా మారుతుందట. రాగికి నీటిలోని బ్యాక్టీరియాను మరియు ఇతర క్రిములను చంపే శక్తి ఉంటుందట. పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవడం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు హరిస్తాయని ఆయుర్వేదం చెబుతోందట. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుందట.

పంచభూతాల కలయిక: శాస్త్రం ప్రకారం, రాగి పాత్రలో నీటిని ఉంచి, దానిపై కొబ్బరికాయ లేదా మూత ఉంచడం వల్ల అది కలశంగా మారుతుందట. ఇది సృష్టికి ప్రతిరూపంగా పరిగణించబడుతుందని… రాగి చెంబులోని నీరు ప్రశాంతతకు, స్వచ్ఛతకు చిహ్నంగా మారిపోతుందని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

గ్రహ దోష నివారణ: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాగి సూర్య గ్రహానికి సంబంధించిన లోహం. పూజగదిలో రాగి పాత్రను ఉపయోగించడం వల్ల సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయట. ఇది ఇంట్లోని వారికి ఆత్మవిశ్వాసాన్ని, ఆరోగ్యాన్ని మరియు అపారమైన కీర్తిని ప్రసాదిస్తుందని పండితులు చెప్తున్నారు.

పాటించవలసిన చిన్న నియమాలు: రాగి చెంబులో నీటిని ప్రతిరోజూ మార్చాలట. పాత నీటిని మొక్కలకు పోసి, తాజా నీటిని నింపాలట. రాగి పాత్ర త్వరగా నల్లబడుతుంది. కాబట్టి దానిని ప్రతిరోజూ చింతపండు లేదా నిమ్మకాయతో శుభ్రం చేసి, తళతళలాడేలా ఉంచాలట. అప్పుడే అది సానుకూల శక్తిని ఎక్కువగా గ్రహించగలదని సూచిస్తున్నారు. పూజగదిలో రాగి చెంబును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదట. అందులో నీరు లేదా అక్షింతలు నింపి ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని పండితులు చెప్తున్నారు. వ్యాపారాలు చేసే వ్యక్తులు అయితే మీ ఆఫీసులో ఈశాన్య మూలలో ఒక చిన్న రాగి పాత్రలో నీటిని ఉంచడం వల్ల వ్యాపారంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: వాస్తు ప్రకారం ఆలాంటి ఇంట్లో ఉంటే ఆయుఃఆరోగ్య ఐశ్వర్యాలు కలిసి వస్తాయట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×