RCB In Black: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా రసంవత్సరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా టోర్నమెంట్ లో 30కి పైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. జరిగిన ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగానే సాగుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపైన ఈ టోర్నమెంట్ లో ఆడే ప్రతి మ్యాచ్ లో బ్లాక్ జెర్సీలో ( RCB In Black ) బరిలోకి దిగాలని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం నిర్ణయం తీసుకుందట. ఈ మేరకు ప్లేయర్ లందరికీ బ్లాక్ జెర్సీలు అందించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సందర్భంగా విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 11 మంది బెంగుళూరు అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు నివాళులు అర్పించేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నారట. రేపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ( Rcb vs GT) మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లోనే బ్లాక్ జెర్సీ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఛాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 18 సంవత్సరాల తర్వాత RCB టైటిల్ గెల్చుకుంది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర గత ఏడాది భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. అయితే ఈ విజయోత్సవ ర్యాలీలో అంచనాలకు మించి జనాలు వచ్చారు. దీంతో పరిస్థితి అదుపుతప్పింది.
తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఏకంగా 11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన అభిమానులు అక్కడికక్కడే స్పాట్లోనే మృతి చెందారు. చాలామందికి గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద సంఘటన జరిగిన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు RCB, కర్ణాటక ప్రభుత్వం అలాగే బీసీసీఐ కొంతమేర సహాయం చేశాయి. అలాగే 11 మంది జ్ఞాపకార్థం చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లను ఖాళీగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియం ముందు అమరవీరుల స్థూపం తరహాలోనే ఓ కట్టడాన్ని ఏర్పాటు చేశారు.
11 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు నివాళులు అర్పించేందుకు కొత్త యాజమాన్యం ఆదిత్య బిర్లా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఇకపైన ఈ సీజన్ లో జరిగే ప్రతి మ్యాచ్ లోనూ బ్లాక్ జెర్సీలో బెంగళూరు ప్లేయర్లు కనిపించేలా అనన్య బిర్లా నిర్ణయం తీసుకున్నారట. ఆమె నిర్ణయం ప్రకారం… రేపటి నుంచి బ్లాక్ జెర్సీలోనే బెంగళూరు ప్లేయర్లు కనిపిస్తారని అంటున్నారు. ఈ మేరకు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో ఏమాత్రం వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.