E-Paper
Advertisement

Dream Home: సొంతింటి కల నెరవేరాలంటే ఈ రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?

Dream Home: సొంతింటి కల నెరవేరాలంటే ఈ రెమెడీస్ పాటించాలట – అవేంటో తెలుసా..?
Advertisement

Dream Home: సొంత ఇంటి కల నెరవేరడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన లక్ష్యం. జ్యోతిష్య మరియు వాస్తు శాస్త్రాల ప్రకారం, మన ప్రయత్నాలకు తోడుగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల అడ్డంకులు తొలగి త్వరగా ఇల్లు నిర్మించుకునే లేదా కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. అయితే ఆ రెమెడీస్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గణపతి ఆరాధన: ఏ పనైనా విఘ్నాలు లేకుండా సాగాలంటే ముందుగా గణపతిని పూజించాలి. ప్రతి మంగళవారం గణపతికి గరిక సమర్పించి, ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని పఠించాలట. అలాగే సొంతిల్లు కట్టుకోవాలన్న మీ ఆశయానికి ఉన్న అడ్డంకులు తొలగిపోవడానికి సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం విశేష ఫలితాన్నిస్తుందట.

Advertisement

వారాహి దేవి పూజ: భూమి, స్థలం మరియు ఇళ్లకు సంబంధించిన విషయాల్లో వారాహి దేవి అనుగ్రహం చాలా త్వరగా లభిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ లేదా శుక్రవారం సాయంత్రం వారాహి దేవి ముందు దీపం వెలిగించి అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడం వల్ల భూ సంబంధిత సమస్యలు తొలగుతాయట. మీరు ఇల్లు కట్టుకోవడానికి ఉన్న శాస్త్ర పరమైన అడ్డంకులు తొలగిపోతాయట.

కుజ (అంగారక) గ్రహ దోష నివారణ: జన్మ కుండలిలో కుజుడు (Mars) భూమికి కారకుడు. కుజుడు బలహీనంగా ఉంటే ఇల్లు కట్టడంలో ఆలస్యం అవుతుందట. అయితే  ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలట. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం లేదా భ్రమరాంబికాష్టకం పఠించడం వల్ల కుజ దోషం తగ్గి, సొంతింటి యోగం పడుతుందట.

Advertisement

వాస్తు మరియు ఇతర పరిహారాలు: మీరు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో నైరుతి (South-West) మూల బరువుగా ఉండేలా చూసుకోవాలట. అక్కడ ఒక చిన్న రాగి పాత్రలో మట్టిని ఉంచడం శుభప్రదమట. అలాగే ప్రతిరోజూ ఉదయం పక్షులకు సజ్జలు లేదా ఇతర ధాన్యాలను ఆహారంగా వేయాలట. ఇది పితృ దోషాలను తొలగించి, మీ కోరిక నెరవేరడానికి దోహదపడుతుందట. ఇక మీరు ఎలాంటి ఇల్లు కట్టాలనుకుంటున్నారో, అలాంటి ఒక చిన్న బొమ్మ ఇల్లును (Miniature house) తెచ్చి మీ పూజ గదిలో ఉంచి, దానికి రోజూ నమస్కరించుకోవాలట. ఇది మీ సంకల్పాన్ని  మరింత బలపరుస్తుందట.

దానధర్మాలు: స్థలం కొనాలనుకునే వారు లేదా ఇల్లు కట్టాలనుకునే వారు పేదవారికి లేదా కూలీలకు ఎర్రటి రంగులో ఉండే పప్పులు (కందులు వంటివి) లేదా బెల్లం దానం చేయడం మంచిదట. అయితే ఈ పరిహారాలు అనేవి మన మానసిక ధైర్యాన్ని, దైవ బలాన్ని పెంచడానికి తోడ్పడతాయి. వీటితో పాటు మీ ఆర్థిక ప్రణాళిక మరియు ప్రయత్నం నిరంతరం కొనసాగించడం అవసరం. మీ జాతక రీత్యా చతుర్థ స్థానం (4th House) బలాన్ని బట్టి ఫలితాలు ఆధారపడి ఉంటాయని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఇంట్లో పూజ చేసిన తర్వాత కాలిపోయిన దీపపు వత్తి,  వాడిపోయిన పూల విషయంలో ఆ తప్పు అసలు చేయకండి

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×