E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 11: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 11: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. 

వృషభం

Advertisement

ఋణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. 

మిథునం

ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. 

కర్కాటకం

Advertisement

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నూతన ధన వస్తులాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

సింహం

సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. 

కన్య

ఇంటా బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం

ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి. 

ధనుస్సు

ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  

మకరం

వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. 

కుంభం

ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. వ్యాపారాలు నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×