E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కిడ్నాపర్ రణవీరేనని తెలుసుకున్న అమర్

Nindu Noorella Saavasam Serial Today Episode April 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కిడ్నాపర్ రణవీరేనని తెలుసుకున్న అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ పోలీసులకు ఫోన్‌ చేసి కిడ్నాప జరిగిన విషయం చెప్పి ప్రతి వెహికిల్‌ చెక్‌ చేయమని చెప్తాడు. అంతా విన్న మనోహరి సెల్లార్‌లోకి వెళ్లి కంగారు పడుతుంది. పైన ఉన్న అమర్‌ హాస్పిటల్‌ సీసీటీవీ ఫుటేజ్‌ చూసి కిడ్నాప్‌ చేసింది రణవీర్‌ అని కన్‌ఫం చేసుకుంటాడు. కింద మనోహరి భయపడుతుంది. ఇక్కడ రణవీర్‌ ఎంక్వైరీ స్టార్ట్‌ చేశాడు. రణవీర్‌ నేను చెప్పినట్టు స్లమ్‌కు వెళ్లాడో లేదో మెయిన్‌ రోడ్డుకు వెళితే పోలీసులకు దొరికిపోతాడు అని ఆలోచిస్తుంటే.. అప్పుడే అక్కడికి మిస్సమ్మ వస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు మనోహరి అని అడగ్గానే.. అది ఫోన్‌ వస్తే మాట్లాడుతున్నాను అని చెప్పగానే.. ఎవరి ఫోన్‌ అని మిస్సమ్మ అడగ్గానే.. ఫ్రెండ్ ఫోన్‌ అని మనోహరి చెప్పగానే.. మిస్సమ్మ ఏ ఫ్రెండ్‌ అని అడగ్గానే..

మనోహరి ఎందుకు అంతలా అడుగుతున్నావు అని అడగ్గానే.. మిస్సమ్మ కోపంగా ఇందాకా నాకు ఫోన్ చేసి ఎవరో నర్స్‌ ఆకాష్‌ మెడికల్‌ హిస్టరీ అడిగింది అని చెప్పావు కదా..? నేను రిసెప్షన్‌లో అడిగితే అలాంటిదేం లేదని చెప్పారే.. అనగానే.. మనోహరి లేదు భాగీ నిజంగానే నన్ను నర్స్‌ అడిగింది అనగానే.. మిస్సమ్మ కోపంగా మనోహరిని కొడుతుంది. దీంతో మనోహరి కోపంగా నన్నే కొడతావా..? నీకెంత ధైర్యం అనగానే.. మిస్సమ్మ మరింత కోపంగా నోర్మూయ్‌ నువ్వు చేసిన పనికి కొట్టడం కాదు.. చంపేయాలి అనగానే.. మనోహరి నేనేం చేశాను అంటుంది. దీంతో మిస్సమ్మ ఆకాష్‌ను కిడ్నాప్‌ చేసింది రణవీరే కదా..? వాడికి హెల్ప్‌ చేసింది నువ్వే కదా అనగానే.. మనోహరి ఏం మాట్లాడుతున్నావు భాగీ.. పిచ్చి పట్టిందా నీకు వాడికి నేనెందుకు సాయం చేస్తాను.. అనగానే..

Advertisement

మిస్సమ్మ కోపంగా అబద్దం చెప్పకు వాడికి సాయం చేసింది నువ్వే.. నీ గురించి నాకు తెలియదా..? నువ్వు వెళ్లింది కోల్‌కతా కాదు కాశ్మీర్ కు. తన కూతురు దొరికిందని కాశ్మీర్‌ వెళ్లిన రణవీర్‌ వెనక నువ్వు దొరకకూడదని వెళ్లావు.. అక్కడి నుంచి రణవీర్‌ తోనే తిరిగి వచ్చావు.. నీ కూతురు కోసం ఆకాష్‌ను కిడ్నాప్‌ చేయమని నువ్వే రణవీర్‌కు ప్లాన్‌ ఇచ్చావు.. ఆయన మెడిసిన్‌ కోసం బయటకు వెళ్లగానే.. ఐసీయూలోకి రణవీర్‌ను పంపావు.. ఆకాష్‌ దగ్గర ఉన్న నన్ను రిసెప్షన్‌ దగ్గరకు వెళ్లేలా చేశావు.. రణవీర్‌ను లోపలికి పిలిచి ఆకాష్‌ను ఎత్తుకెళ్లేలా చేశావు.. ఇదే కదా జరిగింది అనగానే.. మనోహరి షాకింగ్‌ చూస్తూ.. కోపంగా నీకు నిజంగా పిచ్చి పట్టింది భాగీ.. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు.. అనగానే.. మిస్సమ్మ కోపంగా పిచ్చి పట్టింది నాకు కాదు నీకు.. రణవీర్‌తో కలిసి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు.. ఈరోజు ఆకాష్‌ కు ఏమైనా జరిగిందా..? నీకు ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఆయనకు నీ గురించి మొత్తం చెప్పేస్తాను.. సాక్ష్యాలు ఆధారాలు లేవు అనుకోకు నిన్ను తగులబెట్టడానికి నా దగ్గర అన్ని ఉన్నాయి అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే..

మనోహరి కోపంగా ఏంటే రెచ్చిపోతున్నావు.. నేను కరుణిస్తే.. మళ్లీ తిరిగి వచ్చావు.. నేను దయతలిస్తే ఇంట్లో ఉంటున్నదానివి.. నా బిక్ష మీద బతుకుతున్నదానివి నాకే వార్నింగ్‌ ఇస్తున్నావా..? మర్చిపోయావా..? నేను తలుచుకుంటే నిన్ను ఈరోజే ఇంట్లోంచి పంపిచేస్తాను అనగానే.. మిస్సమ్మ కోపంగా తలుచుకో నేను ఏదీ మర్చిపోలేదు మనోహరి. నాకు అన్ని గుర్తు ఉన్నాయి. నేను ఇంట్లోంచి వెళ్లిపోవడానికి నువ్వే కారణం అని నాకు ఎప్పుడో తెలుసు.. నువ్వు కరుణిస్తే నేను తిరిగి రాలేదు. నీ దయ వల్ల నేను ఇంట్లో ఉండటం లేదు. నీ బిక్ష పైన బతకడం లేదు. నేను తిరిగి రావాలి అనుకున్నాను కాబట్టే వచ్చాను. ఇంట్లో ఉండాలి అనుకున్నాను కాబట్టి ఉంటున్నాను. అయినా నా ఇంట్లో నా భర్త నా పిల్లలతో నేను ఉండటం. నీ బిక్ష ఏంటి..? నువ్వు చేసిన పాపాలు అన్నింటిని లెక్క కట్టి వడ్డీతో సహా నీకు తిరిగి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. త్వరలోనే నీ స్టోరీకి ఎండ్‌ కార్డు పెట్టబోతున్నాను. నీ పని అయిపోయింది మనోహరి అంటూ చెప్తుండగానే..

Advertisement

అప్పుడే అమర్‌ వస్తాడు. భాగీ ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ నాకు బాగానే ఉంది మీరు సీసీటీవీ పుటేజీ చూశారు.. కిడ్నాప్‌ చేసింది ఎవరో తెలిసిందా..? అని అడగ్గానే.. చూశాను.. రణవీర్‌ కిడ్నాప్‌ చేశాడు అని అమర్‌ చెప్పగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. వాడు హాస్పిటల్‌ లో చేసిందంగా సీసీటీవీలో రికార్డు అయింది. అంటూ అమర్‌ చెప్తుండగానే.. మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Ninnu kori Serial Today Episode October 10th ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎండింగ్ ఏపిసోడ్ ఇలా ముగుస్తుందనుకోలేదు

Saturday Tv Movies : శనివారం టీవీ సినిమా.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

Advertisement
×