E-Paper
Advertisement

Weekly Horoscope April 19 To April 25: ఈ వారం ఆ రెండు రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు వస్తాయి

Weekly Horoscope April 19 To April 25: ఈ వారం ఆ రెండు రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలు వస్తాయి
Advertisement

Weekly Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఈ వారం (ఏఫ్రిల్ 19–ఏఫ్రిల్ 25) రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ వారం మీకు పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. స్థిరస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నూతన వాహన, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు క్రమ క్రమంగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

వృషభ రాశి: 

Advertisement

ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. నూతన రుణాల కోసం ప్రయత్నాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. విద్యార్థుల శ్రమ అంతగా ఫలించదు. దాయాదుల తో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

 మిథున రాశి: 

ఈ వారం మీకు ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వారం మధ్యలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. గృహ నిర్మాణయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు.

కర్కాటక రాశి:

Advertisement

ఈ వారం మీకు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. సోదరులు, మిత్రుల నుంచి అందిన శుభకార్య ఆహ్వానాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మార్చుకుంటారు. విలువైన వస్త్రా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు.

సింహారాశి:

ఈ వారం మీకు భూ క్రయవిక్రయాలకు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. పాత మిత్రుల నుండి అందిన ఒక ఆసక్తికర సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కొన్ని రంగాల వారు సమస్యలను పరిష్కరించుకుంటారు.

 కన్యా రాశి: 

ఈ వారం మీకు సోదరులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయట బాధ్యతలతో సతమతమవుతారు. కొందరు ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కీలక సమయంలో ఆలోచనలు నిలకడగా ఉండవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

 తులా రాశి:

ఈ వారం మీకు బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచన లో స్థిరత్వం లోపిస్తుంది. సోదరులతో స్థిరాస్తి విషయంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. గృహ నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అధికారులు ఆగ్రహం వలన స్థాన చలనాలు తప్పవు. కొన్ని రంగాల వారు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు.

వృశ్చిక రాశి: 

ఈ వారం మీకు నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు మందగిస్తాయి. సంతాన విద్యా యత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలపై చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనూహ్యమైన అవకాశాలు లభిస్తాయి.  

ధనస్సు రాశి:

ఈ వారం మీకు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరస్తి క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. బంధువుల సహాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు సర్దుమణుగుతాయి.

మకర రాశి:

ఈ వారం మీకు చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. కీలక సమయంలో నిర్ణయాలు హఠాత్తుగా మార్చుకుంటారు. వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు కలుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వారం చివరిలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.

కుంభ రాశి: 

ఈ వారం మీకు బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి విషయంలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు లభించిన అవకాశాలు చేజారుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం ప్రారంభమున కొందరి మాటలు ఆశ్చర్యపరుస్తాయి. కుటుంబ సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది.

మీన రాశి:

ఈ వారం మీకు దూరపు బంధువుల ఆగమనం ఆనందానిస్తుంది. స్థిరస్తి వివాదాలు కొంత బాధిస్తాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×