E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 21: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 21: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 21వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. బంధు మిత్రులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

వృషభం

Advertisement

దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారములలో అలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. 

మిథునం

నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమౌతాయి. సోదరుల నుండి ధన సహాయం లబిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. 

కర్కాటకం

Advertisement

సమాజంలో పెద్దవారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఋణగ్రస్తుల నుండి రావలసిన ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారములలో సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభాలు పొందుతారు.

సింహం

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సోదరులతో స్ధిరాస్తి సంబంధిత వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సంతాన పరంగా స్వల్ప ఇబ్బందులుంటాయి. 

కన్య

చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గానీ పూర్తికావు. బంధు మిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం లోపిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమౌతాయి. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో మనస్పర్ధలు తొలగుతాయి. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి నుండి బయటపడతారు.

వృశ్చికం

ముఖ్యమైన వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాదిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. అవసరానికి ఇతరుల నుండి సహాయం అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. 

ధనుస్సు

బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.  

మకరం

ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. 

కుంభం

సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాలు లాభాలు కలిగిస్తాయి. ముఖ్యమైన విషయాలలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి.

మీనం

వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు చేజారకుండా చూసుకోవాలి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.  ఉద్యోగమున అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×