E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 26: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారికి స్థిరాస్థిలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 26: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – వారికి స్థిరాస్థిలో లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 26వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి స్థిరాస్తి లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కరంగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. 

వృషభం

Advertisement

వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ చింతన కలుగుతుంది. 

మిథునం

గృహమున ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

కర్కాటకం

Advertisement

ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలను అందుకుంటారు. అవసరానికి ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహం

ధనదాయం బాగుంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. 

కన్య

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. భూ క్రయ విక్రయాలలో అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలుంటాయి. వ్యాపారపరంగా ఎదురైన అవరోధాలను అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత ఆశజానాకంగా ఉంటాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. దూర ప్రాంతాల బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

వృశ్చికం

వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సోదరుల నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

ధనుస్సు

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుండి విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి బయటపడతారు. వ్యాపారములు అనుకూలంగా సాగుతాయి.  

మకరం

ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంబించి సకాలంలో పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. 

కుంభం

దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంతాన విద్యా వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

మీనం

చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు కలసివస్తాయి. గృహమున పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.  ముఖ్యమైన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×