E-Paper
Advertisement

ఓటీటీలో ఒంటరిగా చూడాల్సిన సినిమాలు… ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు

ఓటీటీలో ఒంటరిగా చూడాల్సిన సినిమాలు… ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు
Advertisement

Romantic Movies on OTT: ఓటీటీ పుణ్యమా అని అన్ని రకాల జోనర్లు ఇంట్లోనే దర్శనమిస్తున్నాయి. అయితే వీటిలో రొమాంటిక్ కంటెంట్ అందరూ ఇష్టపడుతుంటారు. కానీ కొన్ని సినిమాలు ఏకాంతంగా చూసినప్పుడే ఆ అనుభూతి మరో లెవెల్ కి వెళ్తుంది. మరీ ముఖ్యంగా బోల్డ్ సీన్స్, డార్క్ రొమాన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాలను ఫ్యామిలీతో కలిసి చూడటం దాదాపు అసాధ్యం. రాత్రి పూట ప్రశాంతంగా, ఒంటరిగా కూర్చుని వీటిని బాగా ఎంజాయ్ చెయ్యచ్చు. అలాంటి కొన్ని పాపులర్ సినిమాల లిస్ట్, అవి ఏ ఓటీటీలో ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

1. ది రీడర్ (The Reader)

రెండో ప్రపంచ యుద్ధం నాటి నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక క్లాసిక్. ఒక టీనేజ్ కుర్రాడికి, తనకంటే వయసులో పెద్దదైన ఒక మహిళకు మధ్య సాగే శారీరక సంబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో కేట్ విన్స్‌లెట్ నటన అద్భుతం. బోల్డ్ సీన్స్‌తో పాటు ఇందులో ఉండే ఎమోషనల్ డెప్త్ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది.

2. అన్ ఫెయిత్‌ఫుల్ (Unfaithful)

Advertisement

వివాహేతర సంబంధాల వల్ల వచ్చే పరిణామాలను చాలా బోల్డ్‌గా చూపించిన సినిమా ఇది. ఒక మంచి సంసార జీవితాన్ని గడుపుతున్న మహిళ, ఒక యువకుడి ఆకర్షణలో పడి ఎలా తప్పులో కాలేసింది అనేది ఇందులో ప్రధానాంశం. ఇందులో ఉండే రొమాంటిక్ సన్నివేశాలు చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో దీనిని చూడచ్చు.

3. ది బాయ్ నెక్స్ట్ డోర్ (The Boy Next Door)

జెన్నిఫర్ లోపెజ్ నటించిన ఈ సినిమా ఒక సైకో రొమాంటిక్ థ్రిల్లర్. భర్తకు దూరంగా ఉంటున్న ఓ టీచర్, తన పక్కింటి కుర్రాడితో ఒక రాత్రి గడుపుతుంది. ఆ తర్వాత ఆ కుర్రాడు ఆమెపై పెంచుకున్న వ్యామోహం ఎలాంటి ప్రమాదాలకు దారితీసిందనేది ఈ సినిమా కథ. ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు బోల్డ్ సీన్స్ కూడా ఎక్కువే. నెట్‌ఫ్లిక్స్, గూగుల్ ప్లే మూవీస్ (Netflix, Google Play Movies)లో ఇది అందుబాటులో ఉంది.

4. డీప్ వాటర్ (Deep Water)

Advertisement

బెన్ అఫ్లెక్, అనా డి అర్మాస్ నటించిన ఈ మూవీ ఒక వెరైటీ రొమాంటిక్ థ్రిల్లర్. భార్య వేరే వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్నా భర్త ఎందుకు భరిస్తున్నాడు? అసలు వాళ్ళ మధ్య ఉన్న ఒప్పందం ఏంటి? అనే పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఇది అందుబాటులో ఉంది.

5. లేడీ చాటర్లీస్ లవర్ (Lady Chatterley’s Lover)

ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా. ఒక రిచ్ ఫ్యామిలీ మహిళ, తన ఎస్టేట్‌లో పనిచేసే వ్యక్తితో ప్రేమలో పడుతుంది. కట్టుబాట్లను కాదని వాళ్ళు సాగించే అక్రమ ప్రయాణమే ఈ చిత్రం. ఇందులో విజువల్స్, మేకింగ్ చాలా రిచ్‌గా ఉంటాయి.
నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో దీనిని చూడవచ్చు. ఈ సినిమాలన్నీ కూడా అడల్ట్ కంటెంట్ కలిగినవి. వీటిలో కంటెంట్ తో పాటు బోల్డ్ సన్నివేశాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చూసేటప్పుడు ఖచ్చితంగా హెడ్‌ఫోన్స్ వాడుతూ, ఒంటరిగా చూడటమే మంచిది.

Read Also : 90s లో ప్రతి సంవత్సరం సంచలనం సృష్టించుకుంటూ పోయిన సినిమాలు… వీటిని చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×