E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 27: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వ్యాపారాల్లో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 27: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారికి వ్యాపారాల్లో లాభాలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు ఆలోచనలు మంచివి కావు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్ధిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం పెరుగుతుంది. 

వృషభం

Advertisement

నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి. 

మిథునం

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు విషయంలో పునరాలోచన చెయ్యాలి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం గంధరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. 

కర్కాటకం

Advertisement

కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా చేసుకుంటారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది.

సింహం

ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. గృహ నిర్మాణ వ్యవహారాలలో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి లభించదు. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన పనులు సకాలంలో పూర్తి చెయ్యలేరు. 

కన్య

ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొల్లిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.

వృశ్చికం

ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగ విషయమై అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

ధనుస్సు

బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలసిరావు. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.  

మకరం

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. 

కుంభం

చాలాకాలంగా పూర్తికాని పనులను పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికి అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×