E-Paper
Advertisement

రాశి ఫలితాలు ఏఫ్రిల్ 3: ఆ రాశి వారికి అకస్మిక ధన ప్రాప్తి – వారికి ప్రమోషన్లు

రాశి ఫలితాలు ఏఫ్రిల్ 3: ఆ రాశి వారికి అకస్మిక ధన ప్రాప్తి – వారికి ప్రమోషన్లు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.  దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. 

వృషభం

Advertisement

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. 

మిథునం

నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. 

కర్కాటకం

Advertisement

దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాటపట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి.

సింహం

ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. 

కన్య

ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం

చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

ధనుస్సు

వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి.  

మకరం


ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. 

కుంభం

ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. పాత ఋణాలు తీరుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారమున భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు.

మీనం

నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.  ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×