E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 4: ఆ రాశి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 4: ఆ రాశి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 4వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

వృషభం

Advertisement

భాగస్తులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. 

మిథునం

చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. 

కర్కాటకం

Advertisement

ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధిక వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.

సింహం

ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

కన్య

పాత ఋణాల ఒత్తిడితో నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. ధన ఆదాయం బాగుంటుంది.

వృశ్చికం

దీర్ఘకాలిక ఋణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలసివస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి. 

ధనుస్సు

సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి అధికమౌతుంది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గోనటం మంచిది.  

మకరం


వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలుంటాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. 

కుంభం

నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమౌతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికీ పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×