E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode April 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఒకే గెస్ట్ హౌస్ లో రణవీర్, అమర్, మనోహరి, మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode April 4th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఒకే గెస్ట్ హౌస్ లో రణవీర్, అమర్, మనోహరి, మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌, మిస్సమ్మను తీసుకుని కాశ్మీర్‌ వెళ్లిపోతాడు. ఎయిర్‌ఫోర్ట్ నుంచి గెస్ట్‌హౌస్‌కు కారులో వెళ్తుంటారు. అక్కడి చలికి మిస్సమ్మ వణికిపోతుంది. కాశ్మీర్‌లో ఇంత చలి ఉందేంటండి అయ్య బాబాయో తట్టుకోలేకపోతున్నాను అనగానే.. అమర్‌ కోపంగా కాశ్మీర్‌లో చలి ఉండక ఎండలు ఉంటాయనుకున్నావా..? అవునులే తమరు ఎప్పుడైనా ఊరు దాటి వెళితే కదా..? అనగానే.. మిస్సమ్మ కోపంగా మీరు ఎప్పుడైనా నన్ను తీసుకెళితే కదా..? నీ వెంట వచ్చానని వెటకారం చేయకండి ఇదేం చలిరా దేవుడా..? ఎముకలు కొరికేస్తుంది అంటూ వణికిపోతుంది. దీంతో అమర్‌ కోపంగా రమ్మంటే ఊపుకుంటూ రావడం కాదు వెళ్లే ప్లేస్‌ ఎలాంటిదో తెలుసుకుని రావాలి ఇదిగో వేసుకో అంటూ తన స్వెట్టర్‌ తీసి మిస్సమ్మకు ఇస్తాడు.

అది వేసుకున్నా కూడా మిస్సమ్మ వణికిపోతుంటుంది. నాకంటే తెలియదు.. మీకు తెలుసు కదా..? చెప్పొచ్చు కదా.. అంటుంది. దీంతో అమర్ అన్ని చెప్తారు మరి అనగానే.. మిస్సమ్మ వణుకుతూనే ఈ స్వెటర్‌ కూడా చలి ఆపకపోతే అప్పుడు ఎలా అని అడగ్గానే.. అమర్‌ ఏముంది గట్టిగా పట్టేసుకోవడమే.. అంటాడు. దీంతో మిస్సమ్మ నవ్వుతూ ఓ అందుకోనా చాలా మంది న్యూ మ్యారీడ్‌ కపుల్‌ హనీమూన్‌కు కాశ్మీర్ కు వస్తారు అంటూ అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. దీంతో అమర్‌ ఇరిటేటింగ్‌ గా ఏయ్‌ ఏం చేస్తున్నావు దూరంగా ఉండు నిన్ను కాశ్మీర్‌ తీసుకు రావడమే ఎక్కువ.. మళ్లీ ఇలాంటి ఎక్స్‌ట్రాలు చేశావంటే మధ్యలోనే దించేస్తాను.. మంచులోనే కూరుకుపోయి చలికి గడ్డ కట్టేస్తావు అనగానే.. మిస్సమ్మ కూడా కోపంగా నేనేమీ మిమ్మల్ని కొరుక్కు తినను లేండి..? ఇంకా మీరే నన్నేం చేయకపోతే అంతే చాలు అంటుంది. దీంతో అమర్‌ కోపంగా ఈ ఎక్స్‌ట్రాలే వద్దు అనేది అంటాడు. మిస్సమ్మ మాత్రం చలికి వణికిపోతూ ఉంటుంది.

Advertisement

కొద్ది సేపటి తర్వాత కారు గెస్ట్‌ హౌస్‌ లోకి వెళ్తుంది. లోపల లాల్‌సింగ్‌ వెయిట్‌ చేస్తూ ఉంటాడు. అమర్‌, మిస్సమ్మలను చూసి వెల్‌కం చెప్తాడు. మీ ప్రయాణం ఎలా జరిగింది. అని అడగ్గానే. బాగానే జరిగిందిరా..? అని అమర్‌ చెప్తాడు. మిస్సమ్మ మాత్రం కాశ్మీర్‌లో ఇంత చలి ఉందేంటి అన్నయ్య అని అడుగుతుంది. దీంతో లాల్‌సింగ్‌ మామూలుగా అయితే ఇంత చలి ఉండదు అమ్మ.. నిన్నటి నుంచి ఎక్కువ అయింది. మంచు తుఫాను కూడా రావొచ్చని వెదర్‌ రిఫోర్ట్‌ కూడా చెప్పారు అనగానే.. మిస్సమ్మ ఆశ్చర్యంగా మంచు తుఫానా..? అనగానే.. లాల్‌సింగ్‌ మీ సైడు వర్షం పడ్డట్టు ఇక్కడ మంచు తుఫాను పడుతుంది. అక్కడ తుఫాన్లు చాలా డిజాస్టర్స్‌ సృష్టించినట్టే ఇక్కడ మంచు తుఫాన్లు చాలా డిస్టబెన్స్‌ చేస్తుంటాయి అని చెప్పగానే.. మిస్సమ్మ భయంగా అమ్మో ఈ చలికే తట్టుకోలేకపోతున్నాను ఇక మంచు తుఫాన్లు వస్తే ఎలా ఉంటుందో అనగానే.. లాల్‌సింగ్‌ నవ్వుతూ.. ఏంట్రా సిస్టర్‌కు కాశ్మీర్‌ గురించి నువ్వు ముందే చెప్పలేదా..? అని అడగ్గానే.. అమర్‌ తను ముందస్తు ప్లాన్‌ లేకుండా వచ్చింది అని చెప్తాడు..

దీంతో మిస్సమ్మ కోపంగా నాకు ప్లాన్‌ లేకపోతే మీకు ప్లాన్‌ ఉంటుంది కదా..? అనగానే.. అమర్‌ కూడా కోపంగా అన్ని నేనే చెప్పాలా..? అనగానే.. మిస్సమ్మ మరి ఎందుకు ఉన్నారు మీరు అనగానే.. లాల్‌సింగ్‌ ఆగండి ఆగండి మీరు ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు.. మీరు కలిసిపోయారని రాథోడ్‌ చెప్పారు.. అని అడగ్గానే.. అమర్‌, మిస్సమ్మ నవ్వుతూ దగ్గరవుతూ.. మేము ఊరికే జోక్‌ చేసుకుంటున్నాంరా..? మా మధ్య ఎలాంటి గొడవ లేదు ఏం భాగీ.. అనగానే.. అవును అన్నయ్య మేము ఎప్పుడో కలిసిపోయాము.. ఎప్పుడూ చాలా బాగుంటాము.. ఏవండి మీ చెంపకు ఏదో అంటింది అనగానే.. లాల్‌సింగ్‌ మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం జెలసీగా ఉందిరా యు ఆర్‌ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అంటాడు. తర్వాత అందరూ లోపలికి వెళ్లిపోతారు. మరోవైపు కాశ్మీర్‌ కు రణవీర్‌, మనోహరి వస్తారు.. ఇద్దరూ ఎయిర్‌ఫోర్ట్‌ నుంచి కారులో వెళ్తుంటే.. అమర్‌ కాల్‌ చేస్తాడు. మీ ప్రయాణం ఎలా జరిగింది అని అడగ్గానే.. రణవీర్‌, మనోహరి షాక్‌ అవుతారు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునను ఏకిపారేస్తున్న నా అన్వేషణ అన్వేష్.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 3rd  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు వెనకాలే ఫాలో అవుతున్న రౌడీలు  

బిగ్ బాస్ షోలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న కంటెస్టెంట్ ఈమె!

Gundeninda Gudigantalu : సీరియల్లో యూట్యూబర్ ఎంట్రీ.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam : పల్లవి అవుట్.. ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: బాలుకు ఘోర అవమానం.. ప్రభాకు మైండ్ బ్లాక్ .. మీనా దెబ్బకు సంజు షాక్..

Podarillu Today Episode : మాధవ్ కు ఏమైంది..? చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పెళ్లి చూపులు ఫిక్స్..?

Big Stories

Advertisement
×