E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 7: ఆ రాశి వారికి వృథా ఖర్చులు – ఉద్యోగులకు శుభ దినం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 7: ఆ రాశి వారికి వృథా ఖర్చులు – ఉద్యోగులకు శుభ దినం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి.  ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. 

వృషభం

Advertisement

ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి. 

మిథునం

చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. 

కర్కాటకం

Advertisement

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.

సింహం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

కన్య

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించిన వాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం

గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. 

ధనుస్సు

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.  

మకరం

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి. 

కుంభం

మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం

ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.  దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×