E-Paper
Advertisement

బయట ఒకరితో… ఇంట్లో మరొకరితో… పక్కా చూడాల్సిన స్టోరీ మావా

బయట ఒకరితో… ఇంట్లో మరొకరితో… పక్కా చూడాల్సిన స్టోరీ మావా
Advertisement

Romantic Comedy OTT :తక్కువ బడ్జెట్‌తో తీసిన కొన్ని సినిమాలు, థియేటర్లలో మంచి విజయాలను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక హాలీవుడ్ రొమాంటిక్ కామెడీ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ అలా ఉంటుంది మరి. ఓల్డ్ ఏజ్ లో సాగే ఈ ప్రేమ కథ కామెడీతో కేక పెట్టిస్తుంది. ఆ జంట ఒకరికి తెలీకుండా ఒకరు సీక్రెట్ రిలేషన్ నడుపుతుంటారు. ఈ క్రమంలో వచ్చే సీన్స్ కడుపుబ్బా నవ్వించడంతో పాటు, ఆలోచనలోకూడా పడేస్తాయి. దీనికి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమాను రీమేక్ చేయడం జరిగింది.

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా పేరు ‘ది లవర్స్’ (The Lovers). 2017లో వచ్చిన దీనికి అజాజెల్ జాకబ్స్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2017లో వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా హీరోయిన్ డెబ్రా వింగర్ నటనకు గానూ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రేంజ్‌లో ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లో చూడవచ్చు. ఇదే కథ ఆధారంగా 2024లో హిందీలో ‘దో ఔర్ దో ప్యార్’ (Do Aur Do Pyaar) అనే సినిమాను రూపొందించారు. ఇందులో విద్యాబాలన్, ప్రతీక్ గాంధీ మెయిన్ రోల్స్ చేశారు. ఒరిజినల్ సినిమా చూడలేని వాళ్ళు ఈ హిందీ వెర్షన్‌ని హాట్‌స్టార్‌లో చూడొచ్చు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మైఖేల్, మేరీ అనే మొగుడు పెళ్లాలు, ఒకరికొకరు తెలీకుండా బయట వేరే వాళ్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు. ఇంట్లో చూస్తేనేమో ముఖం ముఖం చూసుకోరు, పరాయి వాళ్ల దగ్గరికి వెళ్తే మాత్రం పరవశించిపోతుంటారు. ఎప్పుడు విడాకులు తీసుకుందామా, ఎప్పుడు ఆ బయట ఉన్న వాళ్లతో సెటిల్ అయిపోదామా అని గట్టిగా ప్లాన్ వేసుకుంటారు. ఒకరకంగా చెప్పాలంటే, ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్టే కనిపిస్తుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. వీళ్లు విడిపోవడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు, ఒక రోజు పొద్దున్నే లేవగానే ఏం మాయ జరిగిందో కానీ, ఇద్దరి మధ్య మళ్ళీ పాత రోజుల్లో ఉన్నట్టే స్పార్క్ పుడుతుంది. బయట ఉన్న లవర్స్ సంగతి పక్కన పెట్టి, దొంగచాటుగా మళ్ళీ ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలుపెడతారు. చివరికి వీళ్ళ కొడుకు తన గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకుని ఇంటికి వచ్చేసరికి అసలు రచ్చ మొదలవుతుంది. ఆ బయట ఉన్న లవర్స్ వీళ్ల మీద ఒత్తిడి తేవడం, లోపల వీళ్లిద్దరి మధ్య సీక్రెట్ లవ్ నడవడం.. అంతా ఒక గందరగోళంగా మారుతుంది. పాత ప్రేమ, కొత్త రిలేషన్ల మధ్య వీళ్లు పడే తంటాలు చూస్తే భలే సరదాగా ఉంటుంది. చివరికి వీళ్ళ ప్రేమ కథలు ఎక్కడికి వెళ్ళి ఆగుతాయో తెలుసుకోవాలనుకుంటే, ఈ మూవీపై ఓ లుక్ వేయండి.

Read Also : సినీ చరిత్రను తిరగ రాసిన గ్రేటెస్ట్ యాక్షన్ సినిమాలు ఇవే… వీటి ట్రైలర్ చూస్తేనే మీ మైండ్ బ్లాక్ అయిపొద్ది

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×