E-Paper
Advertisement

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 9: ఆ రాశి వారికి ఊహించని ధనలాభం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు ఏఫ్రిల్ 9: ఆ రాశి వారికి ఊహించని ధనలాభం
Advertisement

Today Horoscope: 

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన  ఏఫ్రిల్ 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతగా కలిసిరావు. 

వృషభం

Advertisement

స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది. 

మిథునం

సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. 

కర్కాటకం

Advertisement

వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల సూచనలున్నవి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

సింహం

తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. 

కన్య

నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

వృశ్చికం

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. 

ధనుస్సు

వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  

మకరం

సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. 

కుంభం

కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.

మీనం

ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×