E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి,శ్రీయాలకు ఝలక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ.. ఏకలింగం నిజస్వరూపం బయటపడుతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవి,శ్రీయాలకు ఝలక్.. కొత్త క్యారక్టర్ ఎంట్రీ.. ఏకలింగం నిజస్వరూపం బయటపడుతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఆస్తుల గురించి మాట్లాడిన రాజేంద్రప్రసాద్ తో శ్రేయ పల్లవిలు గొడవకి దిగుతారు.. ఇప్పుడున్న కోట్ల ఆస్తిని చూసుకోవడానికి తప్ప అనుభవించడానికి అవసరం లేదా అని శ్రీయ అంటుంది.. ముందు మీరు పిల్లల్ని కనండి అప్పుడు ఆస్తి మీ పిల్లల పేరు మీద ఉంటుంది కదా.. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని రాజేంద్రప్రసాద్ కండిషన్ పెడతాడు.. శ్రీయ పల్లవిలు మావయ్య గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వాటిలో మార్పు ఉండదు.. మనం ఎంత చెప్పినా ఆయన మాట వినరు ముందు మన పని మనం చేసుకోవాలి అని పల్లవి శ్రీయాకు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఆ తర్వాత అక్షయ్ అవనీలు కూడా నాన్న చెప్పిన మాట చాలా బాగుంది. అలా అయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మాట్లాడుకుంటారు.. అవినీ అక్షయ్ లు మాత్రం తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తులు గురించి అలాగే స్కూల్ హాస్పిటల్ ఎలా ఉన్నాయో చూసుకోవాలని అనుకుంటారు.. అక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఉదయం లేవగానే అవని అందరి కోసం అన్ని పనులు చేసి వంట చేసే పనిలో బిజీగా ఉంటుంది.. పల్లవి శ్రియాలు ఆలస్యంగా లేచి వస్తారు. మీరు ఇంత ఆలస్యంగా లేచి వచ్చారు కదా తొందరగా లేవాలని తెలియదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే మేము ఉదయం తొందరగా లేచి ఏం చేయాలి అని పల్లవి అంటుంది.. ఆ నిద్ర మొహాలతో ఉండడం పక్కన పెట్టేసి ముందు వెళ్లి బ్రష్ చేసుకుని ఫ్రెష్ చేయండి అని పార్వతి అంటుంది. పల్లవి శ్రీయాలు మాత్రం మాకు పేస్టు బ్రష్ కావాలని అంటారు.. ఇక వాళ్ళిద్దరూ కలిసి చేసిన రచ్చ అంత ఇంత కాదు… నాన్న ఏది చెప్తే అది చేయాలి కదా మళ్లీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని కమల్ అంటాడు.

Advertisement

ఇక వేప పూలల్ని నోట్లో పెట్టుకున్న పల్లవి శ్రియ ఇద్దరు కూడా చేదుగా ఉన్న ఎలా కడుక్కోవాలి అని అంటారు. ఇలాంటివన్నీ ఇక్కడ చెయ్యక తప్పదు లేకపోతే మాత్రం ఏం చేస్తారో తెలియదు అని కమల్ అంటాడు.. అవని అందరికీ కాఫీ ఇస్తుంది.. కానీ పల్లవిశ్రియాలకు మాత్రం కాఫీ ఇవ్వదు. అదేంటి మాకు కాఫీ ఇవ్వట్లేదు అని అంటుంది పల్లవి. మీరు వెళ్లి ముందు బ్రష్ చేసుకున్నాక స్నానం చేశారండి అని అంటుంది. వాళ్లెవరు కూడా స్నానం చేయలేదు కదా మరి మీవెందుకు స్నానం చేయాలి అని అంటారు.. మీ ఇద్దరికీ మాత్రమే మావయ్య చెప్పారు అని అవని అంటుంది.

ఇక పల్లవి శ్రియ ఇద్దరు కూడా బావిలోని నీటిని తోడి వేడి నీళ్లను పోసుకొని స్నానానికి వెళ్తారు. నీళ్ల కోసం ఆ ఇద్దరు పడిన కష్టాలు అంతా ఇంతా కాదు.. ఇక వాళ్ళిద్దరూ వెళ్లి స్నానం చేసి వస్తారు.. రాజేంద్రప్రసాద్ అందరికీ బైకులను ఏర్పాటు చేస్తారు. వాటిని తీసుకొని ఊరంతా తిరిగి రావాలని అనుకుంటారు. అయితే రాజేంద్రప్రసాద్ మీరిద్దరూ కలిసి మన గెస్ట్ హౌస్ కి వెళ్ళండి అని శ్రీకర్ కమల్ని అంటారు.. ఆ తర్వాత అక్షయ్ అవనీలు ఎందుకు మాతోపాటు రావట్లేదు అని పల్లవి అడుగుతుంది. వాళ్లని నాతో పాటు తీసుకెళ్లి ఊర్లో ఉన్న ఆస్తులు గురించి అలాగే స్కూల్ హాస్పిటల్ ని చూపిస్తానని రాజేంద్రప్రసాద్ అంటాడు.

Advertisement

మమ్మల్ని ఎందుకు తీసుకెళ్లట్లేదు అని పల్లవి, శ్రియాలు అడుగుతారు.. అయితే వాళ్లు ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి మీరు వెళ్లి అక్కడ ఉన్న పనులను చూసుకోండి అని రాజేంద్రప్రసాద్ ఆర్డర్ వేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్లి పోతారు. ఆ తర్వాత ఊర్లో ఉన్న స్కూల్లో చూడ్డానికి అవని అక్షయతో పాటు రాజేంద్రప్రసాద్ వెళ్తారు. ఇక్కడ అనురాధా అక్కడ పేరు వినగానే రాజేంద్రప్రసాద్ ఆగిపోతాడు.. అనురాధ అనే చిన్నమ్మాయిని ఎందుకు గారు అని పిలుస్తున్నారని అవని అడుగుతుంది. రాజేంద్రప్రసాద్ భార్య గురించి వాళ్ళు చాలా గొప్పగా చెప్తారు. అక్షయ ని చూసి చాలా సంతోషపడతారు.

Also Read : ‘పొదరిల్లు ‘ ఆది రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్..?

మీరు చూశారా మీ అమ్మగారు లేరు అని బాధపడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్క ఇంట్లో మీ అమ్మగారి పేరు వినిపిస్తుంది కదా అని అవని అంటుంది అక్షయ్ తో.. ప్రెసిడెంట్ ఏక లింగం తమ్ముడు ఇవాళ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తాడు. అతని పేరు కోటిలింగం.. తింగరి కోటిలింగం ఏది చెప్పినా నమ్మేసి ఎవరి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక అవని అక్షయలు వెళుతూ ఉంటే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆపుతాడు ఏకలింగం.. ఆ తర్వాత హాస్పిటల్ కన్నా వెళ్తాము అంటే అక్కడ మీరు వస్తున్నారని తెలిసి ఏర్పాట్లు చేయలేదు నేను ఒక రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి తీసుకొని వెళ్తాను అని అంటాడు.. పల్లవి శ్రియాలు అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతారు.. మనల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు అని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏకలింగం బండారం బయటపడుతుందేమో చూడాలి..

Related News

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Illu Illalu Pillalu Today Episodes: విశ్వం ప్లాన్ సక్సెస్.. ధీరజ్ కోసం ప్రేమ కన్నీళ్లు.. అడ్డంగా బుక్కయిన ధీరజ్..

Ninnu kori Serial Today Episode September 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: డాక్టర్ ను బెదిరించి నిజం తెలుసుకున్న విరాట్  

Big Stories

Advertisement
×