E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు – వారు చేపట్టిన పనుల్లో విజయం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 28వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. చేపట్టిన పనులలో  జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 

వృషభం

Advertisement

వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. 

మిథునం

ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కర్కాటకం

Advertisement

వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి.  చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం

వృత్తి ఉద్యోగాలలో  పైచేయి సాధిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగమున మీ ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. 

కన్య

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో మరింత అనుకూలం వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.  సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

ఉద్యోగాలలో  కాస్త నిరుత్సాహం తప్పదు. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. సోదరులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు భాధిస్తాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి.

వృశ్చికం

ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాతబాకీలు వసూలవుతాయి. పనులు వేగవంతం చేస్తారు. 

ధనుస్సు

వ్యాపార, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగమున్నది. సన్నిహితులతో విందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

మకరం

ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి. మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువర్గంతో మాటపట్టింపులుంటాయి.  

కుంభం

ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో రావలిసిన పదవులు చేజారుతాయి. చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి.

మీనం

ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమౌతాయి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×