E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/12/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారికి బంధువులతో గొడవలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (02/12/2025) ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు – వారికి బంధువులతో గొడవలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 2వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 కొన్ని వ్యవహారాలలో సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వివాదాలకు సంభందించి కీలక సమాచారం సేకరిస్తారు.  ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

వృషభం

Advertisement

కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.  చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో భాగస్థులతో అకారణ వివాదాలు ఉంటాయి.  దైవ దర్శనాలు చేసుకోవడం మంచిది. 

మిథునం

 నూతన పరిచయాలు ఉత్సాహనిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరానికి చేతికి ధన సహాయం అందుతుంది.వ్యాపారాలు గతం కంటే మంచి లాభాలు అందుతాయి.

కర్కాటకం

Advertisement

 ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

సింహం

సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.  చిన్ననాటి మిత్రులతో పాత విషయాలు చర్చిస్తారు.

కన్య

చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవనుగ్రహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. గృహంలో శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా అభివృద్ధి చెందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వృత్తి ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్థులకు ప్రభుత్వ సంభంధిత ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.  ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం

ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. నూతన వ్యాపార ప్రారంభ పనులు వాయిదా వేస్తారు. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. 

ధనుస్సు

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగుల శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తిగా సాగుతాయి. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు.  సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు.

మకరం

వృత్తి ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కుంభం

వ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆప్తులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి.  వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది.

మీనం

సంతాన ఆరోగ్య విషయాలలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.  ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. బందు వర్గంతో  మాట పట్టింపులుంటాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×