E-Paper
Advertisement

చెట్టుకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.. 128 ఏళ్లుగా విడుదల కాలేదు!

చెట్టుకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేశారు.. 128 ఏళ్లుగా విడుదల కాలేదు!
Advertisement

Tree Arrested in 1898: సాధారణంగా నేరం చేసిన వ్యక్తులకు పోలీసులు సంకెళ్లు వేయడం చూస్తుంటాం. కానీ, ఒక చెట్టుకు సంకెళ్లు వేసి దాన్ని అరెస్ట్ చేయడం ఎప్పుడైనా చూశారా? పాకిస్తాన్‌ లోని లాండి కోటల్‌ లో మాత్రం ఇలాంటి విచిత్రమైన ఘటనకు సంబంధించిన ఓ చెట్టు ఇప్పటికీ కనిపిస్తుంది. భారీ గొలుసులతో బంధించి ఉంటుంది. అంతేకాదు, “నేను అరెస్టులో ఉన్నాను” అని రాసిన ఓ బోర్డు తగిలించి ఉంటుంది.

ఇంతకీ అసలు ఏం జరిగింది? 

ఈ విచిత్రమైన కథ 1898లో మొదలయ్యింది. అప్పట్లో పాకిస్తాన్ అనే దేశం లేదు. ప్రస్తుత ఖైబర్ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. లాండి కోటల్ కూడా బ్రిటిష్ పాలనలోని కీలక సైనిక ప్రాంతాల్లో ఒకటిగా ఉండేది. జేమ్స్ స్క్విడ్ అనే బ్రిటిష్ అధికారి ఒకరోజు మద్యం మత్తులో ఉన్నాడు. ఆ సమయంలో అతనికి అక్కడి చెట్టు తన వైపు కదులుతున్నట్లు అనిపించిందట. అంతేకాదు.. ఆ చెట్టు అక్కడి నుంచి పెషావర్ వైపు వెళ్లిపోతుందేమోనని భావించాడట. దీంతో ఆ చెట్టును వెంటనే అరెస్ట్ చేయాలని అక్కడి మెస్ సార్జెంట్‌ను ఆదేశించాడట. అధికారి ఆదేశం కావడంతో సిబ్బంది కూడా దానిని సీరియస్‌గా తీసుకుని చెట్టుకు భారీ సంకెళ్లు వేసి నేలకు బంధించారట.

చెట్టుకు ఇప్పటికీ సంకెళ్లు

Advertisement

అధికారి మత్తు తగ్గిపోయిన తర్వాత ఆదేశాన్ని వెనక్కి తీసుకున్నాడా? లేక ఆ విషయం పూర్తిగా మరిచిపోయాడా? అనేది స్పష్టంగా తెలియదు. కానీ, చెట్టుకు వేసిన సంకెళ్లు మాత్రం అలాగే ఉండిపోయాయి. కాలం గడిచినా ఆ గొలుసులను తొలగించలేదు. చివరకు ఈ చెట్టు లాండి కోటల్‌ లో  ఒక విచిత్రమైన చారిత్రక గుర్తుగా మారింది. చెట్టుకు వేలాడుతున్న బోర్డుపై “I am under arrest” అనే మాటలు రాసి ఉండటం దీనిని మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.

ఖైబర్ పాస్‌ లోని కీలక ప్రాంతం!

లాండి కోటల్ ఖైబర్ పాస్ పశ్చిమ చివరన ఉన్న ప్రాంతం. భారత ఉపఖండం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్లే మార్గంలో ఖైబర్ పాస్‌కు ఎంతో వ్యూహాత్మక ప్రాధాన్యం ఉండేది. అందుకే బ్రిటిష్ పాలనలో ఈ ప్రాంతంలో భారీగా సైనిక బలగాలను మోహరించారు. 1897లో ఖైబర్ ప్రాంతంలో బ్రిటిష్ పోస్టులపై తీవ్ర దాడులు కూడా జరిగాయి. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో తమ సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసింది. ఖైబర్ రైఫిల్స్ దళాలు కూడా లాండి కోటల్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించాయి.

వలస పాలనకు ఓ విచిత్రమైన గుర్తుగా..

Advertisement

ఈ చెట్టు కథ నిజంగా 1898లో జరిగిన సంఘటనకు సంబంధించినదా? లేక కాలక్రమంలో స్థానికంగా ప్రచారంలోకి వచ్చిన కథనా? అనే విషయంలో స్పష్టమైన చారిత్రక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. అయినప్పటికీ, ఈ కథ చాలా సంవత్సరాలుగా పాకిస్తాన్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చెట్టుకు వేసిన సంకెళ్లు ఇప్పుడు కేవలం ఓ విచిత్రమైన ఘటనకు గుర్తుగా మాత్రమే కాకుండా.. బ్రిటిష్ వలస పాలనలో అధికారుల ఆదేశాలు ఎలా అమలయ్యేవనేదానికి బెస్ట్ ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు.

Read Also: 1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tags

Related News

పసిబిడ్డ కోసం తల్లి అడిగిన చిన్న సాయం.. రైల్వే సిబ్బంది చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

ప్రపంచంలోని టాప్ లగ్జరీ ట్రైన్స్.. ఒక్కో జర్నీ ఖర్చు తెలిస్తే షాక్!

రైలు కింద పడబోయిన ప్రయాణికుడు.. కానిస్టేబుల్ చాకచక్యంతో లైఫ్ సేఫ్!

దసరా, దీపావళికి స్పెషల్ ట్రైన్.. చర్లపల్లి నుంచి బెంగళూరుకు కొత్త సర్వీస్!

రైల్లో వాష్‌ రూమ్ ఉపయోగిస్తున్నారా? ఈ 6 హైజీన్ టిప్స్ తప్పకుండా పాటించాల్సిందే!

ఇక నేరుగా గోవాకు వెళ్లిపోవచ్చు, కొత్త వందేభారత్ వచ్చేస్తోంది!

1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×