E-Paper
Advertisement

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!
Advertisement

Most Beautiful Waterfalls: ప్రకృతి సృష్టించిన అద్భుతాలలో జలపాతాల స్థానం చాలా ప్రత్యేకమైనది. అత్యంత ఎత్తైన కొండల నుంచి జాలువారుతూ, ఇంద్రధనుస్సు అందాలను విరబూయిస్తూ గంభీరమైన నాదంతో ఇవి చూపరులను కట్టి పడేస్తాయి. అంతేకాదు జలపాతాల నుంచి వచ్చే నీటి ధారలు.. ప్రకృతి గీచిన చిత్రలేఖనాలుగా తలపిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత అందమైన టాప్ – 3 జలపాతాలు, వాటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ఇగువాజు జలపాతం (Iguazú Falls)

అర్జెంటీనా, బ్రెజిల్ సరిహద్దులలో విస్తరించి ఉన్న ఇగువాజు జలపాతం.. దాదాపు 2.7 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 275 చిన్న, పెద్ద జలపాతాలు ఒకే చోట దర్శనమిస్తాయి. వీటిలో గుర్రపు నాడా ఆకారంలో ఉండే ‘డెవిల్స్ త్రోట్’ (రాక్షస నోరు) జలపాతం అత్యంత ప్రత్యేకమైనది. ఇక్కడ పడే నీటి హోరు, ఎగిసిపడే తుంపరలు అత్యంత అందమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ప్రదేశం.. జీవవైవిధ్యానికి నిలయంగా దర్శనమిస్తుంది.

విక్టోరియా జలపాతం (Victoria Falls)

Advertisement

జాంబియా, జింబాబ్వే సరిహద్దుల్లో ఉప్పొంగి ప్రవహించే విక్టోరియా జలపాతాన్ని స్థానికులు ‘మోసి-ఓ-తున్యా’ (Mosi-oa-Tunya) అని పిలుస్తారు. అంటే ‘ఉరుములతో కూడిన పొగ’ అని అర్థం. వెడల్పు పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతాలలో ఒకటిగా ఉన్న ఈ జలపాతం.. భారీ నీటి ప్రవాహానికి పేరుగాంచింది. గాల్లో తేలియాడే నీటి తుంపరల మధ్య ఇక్కడ నిత్యం ఇంద్రధనుస్సులు దర్శనిస్తుంటాయి. ఇవి పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తుంటాయి.

ఏంజెల్ జలపాతం (Angel Falls)

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జలపాతంగా ‘ఏంజెల్ జలపాతం’ చరిత్రను తిరగరాసింది. ఏకంగా 979 మీటర్ల (3,212 అడుగులు) ఎత్తు నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఒకే ప్రవాహంగా నీరు కిందకు దూకుతుంది. కనైమా నేషనల్ పార్క్‌లో టెపుయ్ పర్వత శిఖరాల్లో ఈ జలపాతం ఉంది. చాలా ఎత్తు నుంచి పడటం వల్ల, నీరు కింద నేలను తాకేలోపే చాలావరకు ఆవిరై దట్టమైన మంచు పొరలా మారిపోతుంది.

Advertisement

Also Read: అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?

ఏంజెల్ ఎందుకంత స్పెషల్?

పైన పేర్కొన్న జలపాతాల్లో ఏంజెల్ జలపాతం ఎంతో ప్రత్యేకమైనది. దీనికి భారీ ఎత్తే ప్రధాన కారణం. ఆకాశాన్ని తాకే ఎత్తు, మంచు తెరలా మారే నీటి తుంపరలు, మానవ సంచారానికి దూరంగా ప్రశాంతమైన అడవుల మధ్య ఉండటం ఈ జలపాతాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. మెుత్తంగా నీటి ప్రవాహం, ఎత్తుతో పాటు చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం, రమణీయమైన భౌగోళిక పరిస్థితులు, ఈ జలపాతాలను ప్రపంచంలోనే సాటిలేని సహజ సిద్ధమైన కళాఖండాలుగా నిలుపుతున్నాయి.

Also Read: ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

Tags

Related News

అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

Big Stories

Advertisement
×