E-Paper
Advertisement

మద్యానికి నో.. 70 ఏళ్లుగా ఇదే రూల్.. సూర్యాపేటలోని ఈ ఆదర్శ గ్రామం గురించి తెలుసా?

మద్యానికి నో.. 70 ఏళ్లుగా ఇదే రూల్.. సూర్యాపేటలోని ఈ ఆదర్శ గ్రామం గురించి తెలుసా?
Advertisement

Telangana Village With 70-Year Alcohol Ban: సూర్యాపేట జిల్లాలో ఉన్న బండపాలెం గ్రామం తెలంగాణ రాష్ట్రంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కడ చూసినా మద్యం ఏరులై ప్రవహిస్తున్న ఈ రోజుల్లో.. ఈ గ్రామంలో దాదాపు 70 ఏళ్లుగా మందు అమ్మడం, తాగడం అనేది లేదు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామస్తులు ఇప్పటికీ పాటిస్తున్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా, గ్రామస్థులు సమిష్టిగా వాటిని అడ్డుకున్నారు.

తరతరాలుగా కొనసాగుతున్న నిషేధం!

బండపాలెంలో మద్యం నిషేధం నిర్ణయం దశాబ్దాల క్రితమే తీసుకున్నారు. తమ తండ్రులు, తాతల కాలం నుంచే గ్రామంలో మద్యం అమ్మకాలు, వినియోగం ఉండేవి కాదని చెబుతున్నారు గ్రామస్తులు. ఎవరైనా మద్యం తాగినా, అమ్మినా గ్రామస్థులు జరిమానా విధించడంతో పాటు సామాజికంగా కూడా ఒత్తిడి తీసుకొస్తారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్తులు

Advertisement

గతంలో గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని స్థానికులు గుర్తుచేసుకున్నారు. అయితే, గ్రామంలోని మహిళలు, పురుషులు కలిసి ఆ ప్రయత్నాలను అడ్డుకున్నామని తెలిపారు. ఆ తర్వాత కొందరు అక్రమంగా మద్యం తయారు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, గ్రామస్తులు మూకుమ్మడిగా వాటిని కూడా నిలువరించారని చెబుతున్నారు. “మా గ్రామంలో మద్యం ఉండకూడదని అందరం కలిసి నిర్ణయించుకున్నాం. మేమంతా చిన్న రైతులమే. మద్యం కోసం డబ్బు ఖర్చు చేయం. దాంతో కుటుంబాల్లో గొడవలు కూడా తక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా జీవిస్తున్నాం” అంటున్నారు స్థానికులు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు!

గ్రామంలో ఎవరైనా మద్యం తాగితే జరిమానా విధించడంతో పాటు అవసరమైతే గ్రామం నుంచి బహిష్కరించేంత వరకు చర్యలు తీసుకుంటామని స్థానికులు చెబుతున్నారు. అయితే, ఎవరికైనా ఎప్పుడైనా మద్యం తాగాలి అనిపిస్తే, ఇతర గ్రామాలకు వెళ్లి తాగుతారే తప్ప, తమ గ్రామంలో మాత్రం మద్యం అమ్మడం, తాగడం చేయరంటున్నారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారం!

Advertisement

బండపాలెంలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాయి. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం మద్యానికి దూరంగా ఉండటం వల్ల కుటుంబ ఆదాయంలో కొంత భాగం ఆదా అవుతోంది. గ్రామంలో గొడవలు తగ్గి ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని వారు చెబుతున్నారు. అయితే, ఏ కారణంతో ఈ నిషేధం మొదలైందనే విషయంపై మాత్రం స్థానికుల నుంచి స్పష్టమైన సమాధానం లేదు. కారణం ఏదైనా.. ఏడు దశాబ్దాలుగా ఒకే నిర్ణయాన్ని తరతరాలుగా కొనసాగించడం మాత్రం బండపాలెం గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది.

Read Also: మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

Tags

Related News

350 కాదు.. జస్ట్ 250 కిలో మీటర్లేనట.. హైదరాబాద్ బుల్లెట్ రైలు స్పీడ్‌పై షాకింగ్ అప్‌డేట్!

నమో భారత్ ట్రిప్ పాస్ వచ్చేసింది.. ఇక రోజూ టికెట్ అవసరం లేదు!

చీనాబ్ వంతెనపై 100 కి.మీ వేగంతో వందే భారత్ పరుగులు.. వీడియో చూశారా?

టీటీడీ సంచలన నిర్ణయం.. తిరుమలలో ర్యాపిడో, ఓలా, ఉబర్ బైక్ రైడ్స్‌‌పై నిషేధం.. ఎందుకంటే?

బెంగళూరు నుంచి ముంబైకి స్లీపర్ వందే భారత్.. పట్టాలెక్కేది ఎప్పుడంటే?

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

Big Stories

Advertisement
×