E-Paper
Advertisement

ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!

ఇప్పుడు స్మిత్.. అప్పుడు నీర్జా.. తూటాలకు ఎదురొడ్డి వందల మంది ప్రాణాలు కాపాడిన వీరవనిత!
Advertisement

Neerja Bhanot Hijack Story: విమాన ప్రయాణం అంటేనే వేల అడుగుల ఎత్తులో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలనే నమ్మకం. కానీ, ఒక్కసారిగా విమానంలో ప్రమాదం ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది. అలాంటి సమయంలో ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తారు. కానీ, కొందరు మాత్రం తమ ప్రాణాల కంటే ఇతరుల జీవితాలకే విలువ ఇస్తారు. అలాంటి ధైర్యవంతుల జాబితాలో భారతీయ ఫ్లైట్‌ అటెండెంట్‌ నీర్జా భనోట్‌ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. తాజాగా విమానంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌ చేసిన పోరాటం గురించి చర్చ జరుగుతున్న వేళ.. నాలుగు దశాబ్దాల క్రితం నీర్జా చేసిన త్యాగం మరోసారి గుర్తుకొస్తోంది. తుపాకీ తూటాలు చుట్టుముట్టినా ఆమె వెనక్కి తగ్గలేదు. చివరి క్షణం వరకు ప్రయాణికులను రక్షించేందుకు   ప్రయత్నించారు.

కరాచీలో విమానాన్ని హైజాక్‌ చేసిన ఉగ్రవాదులు!

1986 సెప్టెంబరు 5న పాన్‌ ఆమ్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన విమానం ముంబై నుంచి న్యూయార్క్‌ కు బయల్దేరింది. మధ్యలో పాకిస్థాన్‌లోని కరాచీ విమానాశ్రయంలో ఆగింది. విమానం మళ్లీ బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో నలుగురు ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆయుధాలతో విమానంలోకి చొరబడ్డారు. విమానాన్ని హైజాక్‌ చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో విమానంలో ఫ్లైట్‌ అటెండెంట్‌గా ఉన్న నీర్జా మాత్రం ఏమాత్రం తడబడలేదు. వెంటనే కాక్‌పిట్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో పైలట్లు కాక్‌పిట్‌ తలుపులు మూసుకుని విమానాన్ని ఉగ్రవాదుల పూర్తి నియంత్రణలోకి వెళ్లకుండా అడ్డుకోగలిగారు.

పాస్‌ పోర్టులు ఇవ్వకుండా..  

Advertisement

హైజాకర్ల అసలు లక్ష్యం అమెరికా ప్రయాణికులను గుర్తించి వారిని బందీలుగా చేసుకోవడం. అందుకోసం ప్రయాణికుల పాస్‌ పోర్టులను తీసుకురావాలని వారు సిబ్బందిని ఆదేశించారు. అయితే, నీర్జా వారికి సహకరించలేదు. అమెరికా ప్రయాణికులను గుర్తించేందుకు ఉపయోగపడే పాస్‌పోర్టులను దాచిపెట్టారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడడంలో కీలకంగా మారింది.

ముగ్గురు పిల్లలకు అడ్డుగా..

దాదాపు 17 గంటల పాటు హైజాక్‌ పరిస్థితి కొనసాగింది. చర్చలు విఫలమవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విమానంలో ఇంధనం పూర్తవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో ప్రయాణికులను బయటకు పంపించేందుకు నీర్జా చర్యలు ప్రారంభించారు. ఎగ్జిట్‌ డోర్లను తెరిచి ప్రయాణికులను ఒక్కొక్కరినీ విమానం నుంచి బయటకు పంపుతున్నారు. అది గమనించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. అయినప్పటికీ నీర్జా వెనక్కి తగ్గలేదు. ముగ్గురు చిన్నారులను రక్షించే సమయంలో ఆమె వారిని తన శరీరాన్ని అడ్డుపెట్టి కాపాడే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఉగ్రవాదుల తూటాలకు గురై నీర్జా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారు.

 ఎవరీ నీర్జా భనోట్‌?

Advertisement

1963 సెప్టెంబరు 7న చండీగఢ్‌లో జన్మించిన నీర్జా భనోట్‌ వయసు హైజాక్‌ ఘటన జరిగినప్పుడు కేవలం 22 సంవత్సరాలు. పుట్టినరోజుకు సరిగ్గా రెండు రోజుల ముందు ఆమె ప్రాణాలు కోల్పోయారు.ప్రయాణికుల కోసం ఆమె చేసిన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం మరణానంతరం అశోక చక్ర పురస్కారంతో సత్కరించింది. ఆమె జీవితం, ధైర్యసాహసాల ఆధారంగా 2016లో బాలీవుడ్‌లో ‘నీర్జా’ పేరుతో సినిమా కూడా తెరకెక్కింది.

Read Also: మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

Tags

Related News

చెప్పడం కాదు.. చేసి చూపించాడు.. పైలట్‌ బాధ్యత గురించి స్మిత్ మచ్చర్ పాత పాడ్‌కాస్ట్ వైరల్!

రైలు టికెట్ బుక్ చేశారా? ప్రయాణం కుదరకపోతే సింపుల్ గా వేరొకరికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు!

ఎమిరేట్స్ విమానంలో ఏం జరిగింది? ఎమర్జెన్సీ ప్రకటన, ఫ్రాంక్‌ఫర్డ్‌కు మళ్లింపు

భూమిపై అత్యంత సుందరమైన జలపాతాలు.. చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!

అనకొండ vs కొండ చిలువ.. పాముల్లో నిజమైన కింగ్ ఏది? దేని దమ్ము ఎంత?

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

Big Stories

Advertisement
×