E-Paper
Advertisement

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!

ఇసుకను జల్లెడ పడితే బంగారం దొరుకుతుందట.. మునేరులో వింత వేట!
Advertisement

Gold Hunting in Muneru: బంగారం దొరికితే జీవితం మారిపోతుందని చాలామంది కలలు కంటారు. కానీ, ఆ కలను నిజం చేసుకునేందుకు రోజంతా ఇసుకను జల్లెడ పడుతున్న కుటుంబాలు ఉన్నాయి. ఏపీలోని విజయవాడ సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెనుగంచిప్రోలులో ఈ ఆసక్తికర దృశ్యం కనిపిస్తోంది. ఇక్కడి మునేరు ఇసుకలో రంగురాళ్లు, బంగారం కోసం కొందరు కుటుంబాలతో సహా చిత్తూరు నుంచి తరలివస్తున్నారు. ఉదయం మొదలైన వారి వేట.. సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇసుకను తవ్వడం, జల్లెడ పట్టడం.. అందులో ఏదైనా విలువైన వస్తువు దొరుకుతుందేమోనని వెతకడం వారి రోజువారీ పనిగా మారింది.

చిత్తూరు నుంచి వచ్చి.. నెలల తరబడి ఇక్కడే!

ఇదే ప్రాంతంలో ఇప్పుడు మరో రకమైన వేట కొనసాగుతోంది. మునేరు కాజ్‌ వే సమీపంలోని ఇసుకలో రోజూ 20 మందికి పైగా తవ్వకాలు చేస్తున్నారు. వీరిలో చాలామంది చిత్తూరు ప్రాంతానికి చెందినవారే. గత రెండు, మూడు సంవత్సరాలుగా వీరు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. ఒకసారి వస్తే రెండు, మూడు నెలల పాటు పెనుగంచిప్రోలులోనే ఉంటారు. ఆలయం, మునేరు పరిసర ప్రాంతాల్లో తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుని రోజంతా తవ్వకాలు కొనసాగిస్తారు.

ఇసుకలో అదృష్టం కోసం జల్లెడ!

Advertisement

స్థానిక శివాలయం, మునేరు కాజ్‌వే చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరి తవ్వకాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇసుకను తీసి జల్లెడ పట్టడం.. అందులో రంగురాళ్లు లేదా బంగారం లాంటి విలువైన వస్తువులు దొరుకుతాయేమోనని వెతకడం వీరి పని. ప్రతిరోజూ ఏదో ఒకటి దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఖాళీ చేతులతోనే వెళ్లాల్సి వస్తుంది. అయినా అప్పుడప్పుడు లభించే బంగారం తమ జీవనానికి ఉపయోగపడుతోందని అక్కడికి వచ్చిన వారు చెబుతున్నారు.

అదృష్టం ఎప్పుడు తలుపు తడుతుందో?

మునేరు ఇసుకలో గంటల తరబడి తవ్వుతున్న ఈ కుటుంబాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. వారి చేతుల్లో ఉన్నది కేవలం జల్లెడ కాదు.. ఒక ఆశ కూడా. రోజంతా ఇసుకను జల్లెడ పట్టినా దొరికేది కొద్దిమాత్రమే కావచ్చు. కానీ, అదే చిన్న ముక్క తమ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుందన్న నమ్మకంతో మరుసటి రోజూ మళ్లీ మునేరు ఒడ్డుకు వస్తున్నారు.

ఒకప్పుడు ‘పెద కాంచిపురం’గా పేరు!

Advertisement

పెనుగంచిప్రోలుకు చరిత్రతో పాటు ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. పురాతన కాలంలో ఈ ప్రాంతాన్ని ‘పెద కాంచిపురం’గా పిలిచేవారు. అప్పట్లో ఇక్కడ ఏకంగా 101 దేవాలయాలు ఉండేవన్న ప్రచారం ఉంది. మౌద్గల్య ముని తపస్సుతో మునేరు ఏర్పడిందనే స్థానిక విశ్వాసం ఉంది. ఈ నది ఒడ్డున లింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి, తిరుపతమ్మ ఆలయం తదితర ఆలయాలు ఉండేవని చెబుతారు. కాలక్రమంలో కొన్ని ఆలయాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే వాటికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం అప్పుడప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. పెనుగంచిప్రోలు ఒకవైపు పురాతన ఆలయాల చరిత్రను మోస్తుంటే.. మరోవైపు అదే నేలలో తమ అదృష్టాన్ని వెతుక్కుంటున్న కుటుంబాలకు కూడా నిలయంగా మారింది.

Read Also: మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

Tags

Related News

నేషనల్ గార్డ్‌ లో చిన్న కమాండో.. యూనిఫాం, తలకు హెల్మెట్ తో భలే ఉందిగా!

జపాన్‌లో శాశ్వత నివాసం అంత ఈజీ కాదు.. ఫీజు 20 రెట్లు పెంపు, కొత్త రూల్స్!

మందు ముట్టరు.. కట్టుబాటు దాటరు.. 25 ఏళ్లుగా మద్యానికి దూరంగా 11 గ్రామాలు!

పెట్రోల్‌ రూల్స్‌ లో బిగ్‌ చేంజ్‌.. లైసెన్సు లేకుండా బిజినెస్ చేస్తే ఇక అంతే సంగతులు!

ఉరిశిక్షలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా చనిపోని మహిళ, చివరకు ఏం చేశారంటే?

చారణా కోడికి బారణా మసాలా.. రూ. 70 వేల బైక్ మీద రూ. 10 లక్షల చలాన్లు!

ఫ్లైదుబాయ్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. ఏ అవార్డు ఇవ్వనున్నారంటే?

Big Stories

Advertisement
×