E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు – వారు చేపట్టిన పనుల్లో జాప్యం

Today Horoscope in Telugu: ఆ రాశి  నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు – వారు చేపట్టిన పనుల్లో జాప్యం
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 3వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అవరోధాలు కలుగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. రావలసిన ధనం చేతికందడంలో  ఆలస్యం అవుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలించవు. 

వృషభం

Advertisement

 ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో  సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. 

మిథునం

 వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు  సామాన్యంగా సాగుతాయి. గృహమున కొందరు మాటలు మానసికంగా చికాకు పరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.

కర్కాటకం

Advertisement

ఉద్యోగమున  అనుగ్రహం పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. దూరప్రయాణాలు లాభదాయకంగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమకు  తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.  సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

సింహం

ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగమున అదనపు పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.  ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

కన్య

ఇంట్లో సంతాన వివాహ విషయమైన ప్రస్తావన వస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో  చురుకుగా పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగమున  అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులు కొంత కష్టం మీద నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది.

వృశ్చికం

 చిన్ననాటి మిత్రులతో  కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య  అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. 

ధనుస్సు

 దాయాదులతో స్థిరాస్తి  తగాదాలు ఉంటాయి.  సంతానం విద్యా విషయాల నిరుత్సాహపరుస్తాయి.  ఉద్యోగులు  ఆఫీసులో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దైవ సేవా కార్యక్రమాల  పట్ల ఆశక్తి పెరుగుతుంది.

మకరం

 ఉద్యోగాల్లో ఇతరుల నుండి  విమర్శలు తప్పవు. వృధా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.  భూ క్రయ విక్రయాలు నిరుత్సాహపరుస్తాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు.

కుంభం

నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు.  ఇతరుల  సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

మీనం

 దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి.  భూ సంభందిత వ్యవహారాలలో తగాదాలు చికాకు పరుస్తాయి. సంతానంతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమ ఫలితాలుంటాయి.  వ్యాపారాలలో భాగస్తులు నుండి ఒత్తిడి పెరుగుతుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×