OTT Movie : హాలీవుడ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగితి తెలిసిందే. వీటిలో కూడా థ్రిల్లర్ స్టోరీలనే ఎక్కువగా చూస్తుంటారు. కొన్ని సినిమాలలో డైలాగ్స్ తక్కువ, థ్రిల్లర్ ఎక్కువగా ఉంటుంది. వీటికి భాష కూడా అడ్డురాదు. ఎవరికైనా స్టోరీ ఇట్టే అర్థం అయిపోతుంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఇద్దరు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. అందులో కూడా విలన్ మొదట్లోనే కాసేపు కనబడతాడు. రోడ్డున పోతున్న ఒక ఒంటరి అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి ఒక టన్నెల్ లో బంధిస్తాడు విలన్. ఆ తరువాత అసలైన సర్వైవల్ థ్రిల్లర్ స్టార్ట్ అవుతుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి స్పైన్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ ఫ్రెంచ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘మీండర్’. 2020లో విడుదలైన ఈ సినిమా మాథియూ తురి డైరెక్షన్ లో తెరకెక్కింది. ఇందులో గైఆ వెయిస్ (లిసా), పీటర్ ఫ్రాన్జెన్ (ఆడమ్) ప్రధాన పాత్రలో నటించారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
లిసా అనే అమ్మాయి రోడ్డు పక్కన నిలబడి ఉంటుంది. ఒక కారు ఆమె దగ్గర ఆగుతుంది. లోపల ఆడమ్ అనే మనిషి లిఫ్ట్ ఇస్తానంటాడు. లిసా ఎక్కగానే ఆడమ్ ఆమెని కొట్టి మూర్ఛ పోయేలా చేస్తాడు. కళ్లు తెరిచి చూసేసరికి లిసా ఒక భూగర్భ టన్నెల్ లో ఉంటుంది. చుట్టూ ఇనుప గొట్టాలు మాత్రమే, ఎక్కడికీ దారి కనిపించదు. ఆమె చేతికి ఒక లైట్ ఉన్న బ్రాస్లెట్ ఉంటుంది. అది ప్రతి 8 నిమిషాలకి బీప్ ఇచ్చి ఆ సెక్షన్‌ని ఫైర్‌తో కాల్చేస్తుంది. తప్పించుకుని ముందుకు వెళ్లకపోతే మరణం ఖాయం! ఆ ట్యూబ్‌లలో ఏ రూమ్‌కి వెళ్లినా డెడ్లీ ట్రాప్స్ ఉంటాయి. లిసా రక్తం కక్కుతూ, ఎముకలు విరిగిపోతూ ముందుకు పోతూ పోతూ ఫ్లాష్‌బ్యాక్‌లలో ఆమె పాస్ట్ కనిపిస్తుంది.
Read Also : కజిన్‌కి కన్నుకొట్టే అమ్మాయి… ప్రేమ పాఠాలు నేర్పిస్తూ అలాంటి పనులు… సింగిల్‌గా చూడాల్సిన మూవీ
చిన్నప్పుడు కూతుర్ని కోల్పోయిన బాధ, భర్తతో డివోర్స్, ఒంటరితనం ఇవన్నీ ఆమెను డిప్రెషన్ లో పడేస్తాయి. ఇప్పుడు ఈ సైకో ట్రాప్ లో పడుతుంది. చివర్లో ఆమె ఒక సెక్రెట్ కనిపెట్టి, గోడల మీద మార్కింగ్స్ చూసి బయటకి దారి గుర్తిస్తుంది. లిసా రేజర్ వైర్ ట్యూబ్‌లోకి దూకి, శరీరం మొత్తం రక్తం కక్కుతూ, చర్మం ఒలిచిపోతూ ముందుకు వెళ్తుంది. చివరికి ఒక బ్రైట్ లైట్ కనిపించి బయటకు వస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఆ బయట కూడా ఇంకో ట్యూబ్ ఎంట్రన్స్ మాత్రమే ఉంటుంది. లిసా మళ్లీ అదే లూప్‌లో చిక్కుకుంటది. చివరికి లిసా ఆ లూప్ నుంచి బయట పడుతుందా ? ఆ లూప్ లోనే ఉండిపోతుందా ? ఈ క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.