E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు లాభాలు – వారు నూతన వస్తు, వాహనాలు కొంటారు

Today Horoscope in Telugu: ఆ రాశి ఉద్యోగులకు లాభాలు – వారు నూతన వస్తు, వాహనాలు కొంటారు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 6వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. స్ధిరాస్తి వ్యవహారాలలో పెద్దలతో మాట పట్టింపులు తప్పవు. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు కష్టసాద్యంతో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

నూతన ఉద్యోగ అవకాశలు అందుతాయి. అవసరానికి ఇతురుల నుండి ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసి వస్తాయి. సోదరులతో మనస్పర్ధలు తొలగుతాయి. గృహ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. 

మిథునం

ఉద్యోగులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. నూతన వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి గంధరగోళంగా ఉంటుంది.

కర్కాటకం

Advertisement

దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన విద్యా ఉద్యోగ విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి కలుగుతుంది.

సింహం

వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది.

కన్య

గృహమున శుభకార్య విషయమై ప్రస్తావన వస్తుంది. బంధు మిత్రుల సహాయ సహకారాలతో పూర్తి చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

బంధువులలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగమున చాలా కాలంగా వేదిస్తున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి.

వృశ్చికం

వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు విఫలమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. 

ధనుస్సు

ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అధిక కష్టం మీద అల్ప ఫలితం పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. సంతాన వ్యవహారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు కలసి వస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.

కుంభం

సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలలో శత్రు సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. ఆర్థిక ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో సఖ్యత పెరుగుతుంది.

మీనం

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున మంచి పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు. దూరప్రాంతాల బందు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×