E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – ఉద్యోగులకు ప్రమోషన్లు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 16వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన ఋణయత్నాలు చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు జాగ్రత్తగా వ్యవహరించాలి. కీలక విషయాలలో శ్రమపడ్డా ఫలితం లభించదు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. 

మిథునం

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మంచి మాట తీరుతో ఇంటా బయట అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన పనులు నూతనోత్సాహంతో పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి.

కర్కాటకం

Advertisement

ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు.

సింహం

వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. 

కన్య

ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహమును కొందరు ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

కీలక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృశ్చికం

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. బంధు మిత్రులతో మాటపట్టింపులు తప్పవు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ధన పరంగా ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. 

ధనుస్సు

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.  

మకరం

ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది. 

కుంభం

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

మీనం

వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలు గతం కంటే మెరుగైన వాతావరణం ఉంటుంది.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×