E-Paper
Advertisement

IND VS PAK: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ..పాకిస్తాన్ ఫ్యాన్స్ క‌న్నీళ్లు, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లో సంబ‌రాలు

IND VS PAK: టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ..పాకిస్తాన్ ఫ్యాన్స్ క‌న్నీళ్లు, ఆఫ్ఘనిస్తాన్, బలూచిస్తాన్ లో సంబ‌రాలు
Advertisement

IND VS PAK: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే 27 మ్యాచ్ ల వరకు పూర్తయ్యాయి. సూపర్ 8 దశకు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ వచ్చేసింది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. శివరాత్రి రోజు జరిగిన ఈ మ్యాచ్ ల పాకిస్తాన్ కు కాలరాత్రి మిగిల్చింది టీమిండియా. ఈ మ్యాచ్ లో ఏకంగా 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చిత్తు చేసింది టీం ఇండియా.

Also Read: AUS vs ZIM-IND WC Wins: జింబాబ్వే చేతిలో ఆస్ట్రేలియా ఓట‌మి..టీమిండియానే ఈ సారి ఛాంపియ‌న్‌…ఊరిస్తోన్న 1983, 2007 సెంటిమెంట్‌

పాకిస్తాన్ అభిమానుల కన్నీళ్లు.. ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు

Advertisement

టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో కొలంబోలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య భయంకరమైన ఫైట్ జరిగింది. టి20 టోర్నమెంట్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోగా ఇండియా విజయం సాధించింది. అయితే ఇండియా గెలిచిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు జరుగుతున్నాయి. మన ఇండియాలో కంటే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ను మొదటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా అందరూ చూశారు. ఇక ఇండియా 61 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆఫ్గనిస్తాన్ ( Afghanistan) స్థానికులతో పాటు తాలిబన్లు ( Afghanistan Talibans) కూడా సంబరాలు చేసుకున్నారు. డీజే పాటలు పెట్టుకొని మరీ డ్యాన్సులు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ సంబరాలు చేసుకోవడానికి కారణం ఏంటి ?

Advertisement

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య శత్రుత్వం ఎలా ఏర్పడిందో .. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా అలాగే ఉంది. దానికి తగ్గట్టుగానే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి ప్రతిసారి ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ సహాయం చేస్తూ వస్తోంది. అటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల కారణంగా ఈ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఇండియన్స్ అంటే ఆఫ్ఘనిస్తాన్ వాళ్లకు అభిమానం విపరీతంగా పెరిగిపోయింది.

అందుకే పాకిస్థాన్ లో ఓడించినందుకుగాను ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇదే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో దక్షిణాఫ్రికా చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. ఈ టోర్నమెంట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎలిమినేట్ అయ్యే ప్రమాదము ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ చేశారు పాకిస్తాన్ అభిమానులు. అయితే వీటన్నిటిని మనసులో పెట్టుకున్న ఆఫ్గనిస్తాన్ ( Afghanistan ) ప్రజలు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నారు. బలూచిస్తాన్ లో కూడా సంబ‌రాలు చేసుకున్నార‌ట‌.

Also Read: Inzamam ul haq: రేపటి మ్యాచ్ లో టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే, BCCIని రోడ్డుకు ఈడ్చుతా… ఇంజమామ్ హాట్ కామెంట్స్

 

 

?igsh=OTdrZW1ueTdhMXIw

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×