E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అంతరాయం – వారికి అనారోగ్య సమస్యలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో అంతరాయం – వారికి అనారోగ్య సమస్యలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 1వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. 

వృషభం

Advertisement

సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.  వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు. 

మిథునం

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటకం

Advertisement

ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం

బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. 

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం

సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. 

ధనుస్సు

సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి.  

మకరం

రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి.  

కుంభం

దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి.

మీనం

గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.  ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×