E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి నూతన వాహన యోగం – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 25వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.  వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. 

వృషభం

Advertisement

చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన నష్టాలు తప్పవు. దూర ప్రయాణాలు వలన వృధా ఖర్చులు పెరుగుతాయి. 

మిథునం

నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలు అందుకుంటారు. కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం

Advertisement

ఆర్థిక పరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందువినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

సింహం

దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నూతన ఋణ ప్రయత్నాలు అంతగా కలిసిరావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి. 

కన్య

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయమై మాటపట్టింపులు ఉంటాయి. ఇంటాబయట ఋణపరమైన ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలను జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.

వృశ్చికం

సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

ధనుస్సు

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.  

మకరం

చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికం అవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలకు వెళ్లకపోవడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. 

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

మీనం

ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా భాధ కలిగిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×