E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఫిబ్రవరి 2వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ధన సంబంధిత వ్యవహారాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు మిశ్రమంగా సాగుతాయి. 

వృషభం

Advertisement

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చి ఊరట చెందుతారు. సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతాయి. 

మిథునం

ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

కర్కాటకం

Advertisement

వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. బంధు మిత్రుల నుండి వివాదాలకు చెందిన సమాచారం అందుతుంది. గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

సింహం

వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. స్నేహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం ఉంటుంది.  కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. 

కన్య

సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుడతారు. అవసరానికి ధనం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. వృత్తి ఉద్యోగాలలో స్వల్ప స్థానచలనాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపార కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

వృశ్చికం

గృహమున సంతాన వివాహ శుభకార్య ప్రస్తావన వస్తుంది. సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ధన సంబంధ వ్యవహారాలు కలిసివస్తాయి. ప్రయాణాలలో వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. 

ధనుస్సు

సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు రెట్టించిన ఉత్సాహంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూర ప్రాంత బంధు మిత్రుల ఆగమనం సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమౌతాయి. అన్ని వైపుల నుండి అదాయం అందుతుంది.  

మకరం

పాత రుణాలను కొంతవరకు తీర్చగలుగుతారు. దూరప్రాంత బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తాయి. ధన పరంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు.  

కుంభం

చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులు జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వ్యాపారములు మందకొడిగా సాగుతాయి.

మీనం

గృహమున శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. వ్యాపారాలలో ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఆప్తులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుచేసుకుని బాధపడతారు. ఇంటా బయట అనుకూలత పెరుగుతుంది. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×