E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి పనులలో ఆకస్మిక విజయం – ఉద్యోగులకు ప్రమోషన్లు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి పనులలో ఆకస్మిక విజయం – ఉద్యోగులకు ప్రమోషన్లు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 27వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

  నూతన వాహనం కొనుగోలు చేస్తారు.  వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు సాధిస్తారు. సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. భూ క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందుతారు. 

వృషభం

Advertisement

దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.  కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దీర్ఘకాలిక వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు. 

మిథునం

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలున్నవి. రుణ పరమైన ఒత్తిడిలు మానసిక సమస్యలు కలిగిస్తాయి.  ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. చేపట్టిన పనులు చాలాకష్టం మీద పూర్తి అవుతాయి. ఉద్యోగాలలో అధికారుల కోపానికి గురి అవుతారు.

కర్కాటకం

Advertisement

సంతాన విద్యా విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. వ్యాపారాలు  పురోగతిలో సాధిస్తారు. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

సింహం

నిరుద్యోగుల ప్రయత్నాలు కలసివస్తాయి. వృత్తి వ్యాపారాలలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. నూతన  వ్యక్తుల పరిచయం లాభిస్తుంది. చేపట్టిన వ్యవహారములలో అనుకూలత కలుగుతుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. 

కన్య

గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి.  వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో  శ్రమాధిక్యత కలుగుతుంది. బంధు మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.  ఆర్ధిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహ పరుస్తుంది.

వృశ్చికం

సన్నిహితులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. సోదరుల నుండి  శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక వివాదాలు  పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు అందిన సమాచారం  ఉత్సాహాన్నిస్తుంది. 

ధనుస్సు

నేత్ర సంభందిత ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసిరావు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. చేపట్టిన  పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం  కొంత  చికాకు కలిగిస్తుంది.  ఉద్యోగమున అదనపు బాధ్యతలు ఉంటాయి.  

మకరం

వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో ఆకస్మిక విజయం కలుగుతుంది. ఖర్చుకు మించిన ఆదాయం సంతృప్తి కలిగిస్తుంది.  ఉద్యోగమున  ఆశించిన అవకాశములు అందుతాయి.  

కుంభం

దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తివ్యాపారాలలో ఊహించని మార్పులు తప్పవు. ప్రయాణాలు వాయిదాపడతాయి. జీవిత భాగస్వామితో  అకారణ వివాదాలు కలుగుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.  ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

మీనం

నిరుద్యోగులకు అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది.  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున  శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల అండదండలు పొందుతారు. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×