E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ధన వ్యయం – ఉద్యోగులకు అనుకూలమైన ట్రాన్స్ ఫర్లు

Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ధన వ్యయం – ఉద్యోగులకు అనుకూలమైన ట్రాన్స్ ఫర్లు

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన జనవరి 28వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి  ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 

వృషభం

మొండి బకాయిలు వసూలవుతాయి.  వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. 

మిథునం

వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ  తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి.  విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ  ఫలితాలు అందుతాయి.

కర్కాటకం

కీలక వ్యవహారాలలో ఆప్తులతో  మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల  ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి.  చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.  ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

సింహం

అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు మిత్రులతో   చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. వ్యాపారాలలో  నష్టాలు  భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో  సమస్యల నుండి బయట పడతారు. 

కన్య

ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.  సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల  ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం

ఉద్యోగమున అప్పగించిన  బాధ్యతలు నిర్వహించడంలో  విఫలమౌతారు. చేపట్టిన  పనులు నిదానంగా  సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  ఆస్తి  వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. 

ధనుస్సు

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు  అందుతాయి   మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక  సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో తెలివిగా  సమస్యల నుండి బయట పడతారు.  

మకరం

కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక  ధనవ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు.  

కుంభం

పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి. ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార  అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి.  గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

మీనం

చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం  మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక  సమాచారం అందుతుంది. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. 

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే10: ఆ రాశి స్థిరాస్థి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు

Weekly Horoscope May 10 To May 16: ఈ వారం ఆ రాశి రాజకీయ నాయకులకు అద్బుతంగా ఉంటుంది

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 09: ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 08: ఆ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది – వారికి వ్యాపారంలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 07: ఆ రాశి వారికి అకస్మిక ధన లాభం – వారికి వ్యాపారాలలో లాభాలు

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే 06: ఆ రాశి వారు చేపట్టిన పనుల్లో విజయం – వారికి ప్రముఖులతో పరిచయం

Big Stories

×