E-Paper
Advertisement

Upcoming Movies OTT : తెలుగు నుంచి మలయాళం వరకు 4 రోజుల్లో 7 మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు… ఏ ఓటీటీలో ఏ మూవీ ?

Upcoming Movies OTT : తెలుగు నుంచి మలయాళం వరకు 4 రోజుల్లో 7 మోస్ట్ అవైటింగ్ సినిమాలు, సిరీస్ లు… ఏ ఓటీటీలో ఏ మూవీ ?
Advertisement

Upcoming Movies OTT : మనం అధికారికంగా 76 వ గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈ సందర్భంలో దేశభక్తి భావనలు మరింత పెంచే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో  స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ వారం ఓటీటీలోకి ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని హైలైట్ రిలీజ్‌ల గురించి ఇక్కడ తెలుసుకుందాం. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయి ఈ సినిమాలు.

గొల్ల రామవ్వ

నిన్నటి నుండి ETV Winలో ప్రసారమవుతున్న ఈ తెలుగు షార్ట్ ఫిల్మ్, మాజీ ప్రధాన మంత్రి PV నరసింహారావు రాసిన ఒక చిన్న కథ ఆధారంగా తీసింది. తాళ్లూరి రామేశ్వరి ప్రధాన పాత్రలో నటించగా, ముళ్లపూడి వర దర్శకత్వం వహించారు. గ్రామీణ జీవితం, మానవ సంబంధాలతో నడిచే ఈ కథ ఎమోషనల్ టచ్‌ ని ఇస్తుంది.

ఛాంపియన్

Advertisement

రోషన్ మేక దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు 2026 జనవరి 29 నుండి Netflixలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి సూట్ అవుతుంది.

ధురంధర్

రణవీర్ సింగ్ లీడ్‌లో వచ్చిన ఈ బాలీవుడ్ స్పై యాక్షన్ డ్రామా 2025లో బాక్సాఫీస్ హిట్ అయింది. 2026 జనవరి 30 నుండి Netflixలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా వస్తుంది. ఇంటెన్స్ యాక్షన్ కోసం ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దల్దల్

Advertisement

భూమి పెడ్నేకర్ నటించిన ఈ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ 2026 జనవరి 30 నుండి Prime Videoలో విడుదల కానుంది. విష్ ధమిజా రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ‘భేండి బజార్’ ఆధారంగా తీసిన సిరీస్ ఇది. అమృత్ రాజ్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన ఈ కథ, క్రైమ్ థ్రిల్లర్ ఫ్యాన్స్‌కి బాగుంటుంది.

గుస్తాఖ్ ఇష్క్

విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన ఈ హిందీ రొమాంటిక్ డ్రామా నవంబర్ 2025లో థియేటర్లలో విడుదలైంది. విభు పూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు 2026 జనవరి 27 నుండి JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. లవ్, ఎమోషన్స్ మిక్స్‌తో ఉన్న ఈ చిత్రం తెలుగులో అందుబాటులో లేదు కానీ హిందీ లవర్స్‌కి మస్త్ వాచ్ మూవీ.

వీల్ ఆఫ్ ఫార్చూన్

అక్షయ్ కుమార్ హోస్ట్ చేసే ఈ గేమ్ షో 2026 జనవరి 27 నుంచి SonyLIVలో ప్రీమియర్ అవుతోంది. ప్రముఖులతో కలిసి లాంచ్ ఎపిసోడ్ ఉంటుంది. ఫన్, ఎక్సైట్‌మెంట్ తో నడిచే ఈ షో వీకెండ్‌కి పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్.

సర్వం మాయ

అఖిల్ సత్యన్ దర్శకత్వంలో నివిన్ పౌలీ, రియా శిబు నటించిన ఈ మలయాళ సూపర్‌నేచురల్ కామెడీ బాక్సాఫీస్ హిట్ అయింది. 2026 జనవరి 30 నుండి JioHotstarలో తెలుగు వెర్షన్‌తో సహా అందుబాటులో ఉంటుంది. ఈ వారంలో ఫ్యామిలీతో కలిసి ఈ కంటెంట్‌ను ఎంజాయ్ చేయండి.

Read Also : జనవరి చివరి వారం మిస్ అవ్వకుండా చూడాల్సిన మలయాళ సినిమాలు… లిస్ట్ లో 100 కోట్ల సినిమా కూడా

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×