E-Paper
Advertisement

Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత

Gali JanardhanReddy: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు, బళ్లారిలో ఉద్రిక్తత
Advertisement

Gali JanardhanReddyకర్ణాటక‌లోని బళ్లారి సిటీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్లెక్సీల వ్యవహారం కాస్త వివాదంగా మారింది. దీంతో ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడు సతీష్‌‌రెడ్డి గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.   మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి తప్పించుకున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు.

బళ్లారిలో వేడెక్కిన రాజకీయాలు

Advertisement

కర్ణాటకలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడేళ్లు సమయం ఉండడంతో ఇప్పటికే కాంగ్రెస్- బీజేపీ అన్నమాదిరిగా సాగుతోంది. ముఖ్యంగా బళ్లారి ఏరియాలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గురువారం రాత్రి బళ్లారి సిటీలో వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముందు బ్యానర్ల ఏర్పాటు వ్యవహారం తారాస్థాయికి చేరింది.

Advertisement

ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరులు ఫ్లెక్సీ లు కడుతుండగా వద్దని వారించారు గాలి అనుచరులు. దీంతో కాంగ్రెస్-బీజేపీ వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టాలని ప్రయత్నించారు ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరుడు సతీష్‌రెడ్డి. చివరకు గన్‌మన్ వద్ద తుపాకీ లాక్కుని సతీష్‌రెడ్డి రెండు రౌండ్ల పాటు కాల్పులు జరిపాడు.

గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం.. రెండు రౌండ్లు కాల్పులు

ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కాల్పుల సమయంలో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి తప్పించుకున్నారు.  దీని గురించి తెలియగానే ఎమ్మెల్యే భరత్‌రెడ్డి రాత్రి 9 గంటల సమయంలో ఆ ప్రాంతానికి వచ్చారు. ఎమ్మెల్యే భరత్ రెడ్డి-గాలి అనుచరులు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థితి గమనించిన ఆ జిల్లా ఎస్పీ, బళ్లారిలో 144 సెక్షన్ విధించారు. కీలక నాయకులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రాకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు నగరంలోకి రాకుండా పోలీసులు అడుగడుగునా మోహరించారు.

ఘటన స్థలానికి బళ్లారి ఎస్పీ పవన్ నెజ్జూరు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. గురువారం బళ్లారి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు పవన్ నెజ్జూరు. గతంలో ఉన్న ఎస్పీ శోభారాణి బదిలీ‌పై వెళ్ళగానే ఈ ఘటన జరిగింది. కావాలనే ఎస్పీ శోభ రాణి నీ కావాలనే బదిలీ చేయించారనే ఆరోపణలు లేకపోలేదు. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించిన ఎస్పీ శోభారాణిని మాండ్య‌కు బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం.

ALSO READ: విమానం ఎక్కిన మహిళకు నరకం కనిపించింది, ఏం జరిగింది?

బళ్లారిలో జరిగిన సంఘటనలో గాలి జనార్థన్‌రెడ్డి సహా దాదాపు డజను మందిపై కేసు నమోదు అయ్యింది. ఎమ్మెల్యే భరత్‌రెడ్డి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యానర్లను ఏర్పాటు చేసి తొలగించారని, దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ పేర్కొన్నాడు. గాలి జనార్ధన రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, శ్రీరాములు, మోత్కార్ శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, రాముడు, పలన్న, దివాకర్, మారుతి ప్రసాద్, దమ్మూర్ శేఖర్, అలీఖాన్ వారిపై కేసులు నమోదు అయ్యాయి.

ఘటన తర్వాత మీడియా మాట్లాడారు మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, ఆయన కొడుకు ఎమ్మెల్యే భరత్‌రెడ్డిలకు నేర చరిత్ర ఉందని ఆరోపించారు. రెండున్నర దశాబ్దాలుగా రౌడీయిజం చేస్తున్నా బీజేపీని అధికారంలోకి తెచ్చామన్నారు. గురువారం ఉదయం తన ఇంటి ఆవరణలో బ్యానర్లు కట్టారని, ఆ తర్వాత పడిపోయాయని తెలిపారు.

ఈ విషయం సెక్యూరిటీ గార్డులు తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పి బ్యానర్‌ కడుతామని చెప్పినా ఏ మాత్రం వినలేదన్నారు. మా ఇంటి ముందు రహదారిపై ఎమ్మెల్యే సహచరుడు నానా యాంగీ చేయడంతో కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారని వివరించారు.

ఈ ఘర్షణలో తన ఇంటిపై రాళ్లు విసిరారని, ఆ సమయంలో బయటి నుంచి ఇంటికి వచ్చే సమయంలో సతీష్‌రెడ్డి భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారని వివరించారు. ఇప్పటికే వాల్మీకి విగ్రహం ప్రతిష్ఠించామి, మళ్లీ ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాజకీయ భవిష్యత్తు లేదనిభావించి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి.

 

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×