E-Paper
Advertisement

Smartphone Comparison: ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ vs వివో X300 vs వన్‌ప్లస్ 15.. కొత్త ప్రీమియం ఫోన్లలో ఏది బెస్ట్?

Smartphone Comparison: ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ vs వివో X300 vs వన్‌ప్లస్ 15.. కొత్త ప్రీమియం ఫోన్లలో ఏది బెస్ట్?
Advertisement

Oppo Reno 15 Pro Max vs Vivo X300 vs OnePlus 15 Smartphone Comparison| ఓప్పో కంపెనీ ఇండియాలో కొత్తగా ప్రీమియం ఫోన్ ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్‌ను ఇటీవల లాంచ్ చేసింది. నెల రోజుల క్రితం వివో, వన్‌ప్లస్ బ్రాండ్లు కూడా ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లు వివో X300, వన్‌ప్లస్ 15 విడుదల చేశాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్‌ తో ఫీచర్ల పరంగా పోటీ పడుతున్నాయి. మూడు ఫోన్లు ప్రీమియం కస్టమర్లను టార్గెట్ చేస్తున్నాయి. పర్‌ఫామెన్స్, కెమెరా క్వాలిటీ, బ్యాటరీ లైఫ్‌పై దృష్టి పెట్టాయి. ఈ మూడు ఫోన్ల ధరలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లను పోల్చి వీటిలో ఏది బెస్ట్ అనేది తెలుసుకుందాం.

ధర, స్టోరేజ్ ఆప్షన్లు

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ .. ఒకే స్టోరేజ్ ఆప్షన్‌లో విడుదలైంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ ధర సుమారు రూ.71,500.
వన్‌ప్లస్ 15 రెండు వేరియంట్లలో ఉంది. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.72,999. మరో వేరియంట్ 16GB ర్యామ్ + 512GB ధర రూ.79,999.
వివో X300 కూడా రెండు వేరియంట్లలో ఉంది. 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర రూ.75,999. 12GB ర్యామ్ + 512GB వేరియంట్ ధర రూ.81,999.

డిస్‌ప్లే పోలిక

Advertisement

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్‌లో 6.78 ఇంచ్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది.
వన్‌ప్లస్ 15లో 6.78 ఇంచ్ LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1272 x 2772 పిక్సెల్స్, 1Hz నుంచి 165Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది.
వివో X300లో 6.31 ఇంచ్ LTPO OLED డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1216 x 2640 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ సాంప్లింగ్ రేట్ ఉంది.

ప్రాసెసర్, పర్‌ఫామెన్స్

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంది. పవర్ ఎఫిషియెన్సీ, స్టేబుల్ పనితీరుపై దృష్టి పెట్టింది.
వన్‌ప్లస్ 15లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ పనితీరు, గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్‌కు బాగుంటుంది.
వివో X300లో మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్ ఉంది. హై పర్‌ఫామెన్స్, AI ఎఫిషియెన్సీపై ఫోకస్ చేసే ఫోన్ ఇది.

సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ ఆండ్రాయిడ్ 16తో కలర్‌ఓఎస్ 16 ఇంటర్‌ఫేస్‌లో నడుస్తుంది.
వన్‌ప్లస్ 15 ఆండ్రాయిడ్ 15తో కలర్‌ఓఎస్ 16 ఉపయోగిస్తుంది.
వివో X300 ఆండ్రాయిడ్ 16తో ఒరిజిన్‌ఓఎస్ 6 ఇంటర్‌ఫేస్‌లో నడుస్తుంది.
ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ లో అడ్వాన్స్ ఆండ్రాయిడ్ ఉంది.

కెమెరా స్పెసిఫికేషన్లు

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ ప్రధాన కెమెరా 200MP రిజల్యూషన్‌ను అందిస్తుంది. టెలిఫోటో లెన్స్ 50MPతో 3.5x ఆప్టికల్ జూమ్‌. వైడ్-ఆంగిల్ లెన్స్ కూడా 50MP. కానీ ప్రధాన టెలిఫోటో లెన్స్‌ల మాదిరిగా దీనిలో ఆప్టికల్ జూమ్ సౌకర్యం లేదు. IP69 సర్టిఫికేషన్ ఉండటం వల్ల రెనో 15 ప్రో మ్యాక్స్‌ను నీటి లోపల కూడా ఫోటోగ్రఫీ కోసం కూడా ఉపయోగించవచ్చు.
వన్‌ప్లస్ 15లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 50MP ప్రైమరీ (OISతో), 50MP పెరిస్కోప్ టెలిఫోటో, 50MP అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 32MP.
వివో X300 కెమెరాపై ఎక్కువ దృష్టి పెట్టింది. 200MP ప్రైమరీ (OISతో), 50MP వైడ్-ఆంగిల్, 50MP టెలిఫోటో (3x ఆప్టికల్ జూమ్) కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 50MP.
ఓప్పో, వివో కెమెరా పరంగా బాగున్నాయి. అయితే ఓప్పో అండర్ వాటర్ ఫొటోగ్రఫీ ఫీచర్ తో ఓప్పో ఆధిక్యంలో ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ డ్యూయల్ సిమ్, 5G, వై-ఫై 6E, బ్లూటూత్ 5.4, NFC మరియు USB టైప్-సీ సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ 15లో 5G, వై-ఫై, NFC, బ్లూటూత్ 5.4 మరియు GPS ఉన్నాయి. వివో X300లో 5G, 4G, బ్లూటూత్ 6, వై-ఫై, NFC, GPS మరియు OTG సపోర్ట్ ఉన్నాయి.

Also Read: నకిలి వెబ్‌సైట్స్, ఫేక్ యాప్స్‌తో తీవ్రంగా పెరుగుతున్న సైబర్ మోసాలు.. ఇలా గుర్తించండి

సైజు, బరువు

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ బరువు 205 గ్రాములు, మందం 7.65mm. వన్‌ప్లస్ 15 బరువు 211 గ్రాములు, మందం 8.10mm. వివో X300 బరువు 190 గ్రాములు, కాంపాక్ట్ మరియు లైట్‌వెయిట్.

బ్యాటరీ, ఛార్జింగ్

ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్‌లో 6500mAh బ్యాటరీ ఉంది. 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వన్‌ప్లస్ 15లో 7300mAh బ్యాటరీ ఉంది. 120W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఉంది. వివో X300లో 6040mAh బ్యాటరీ ఉంది. 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

ఫైనల్ విన్నర్?

వన్‌ప్లస్ 15 అత్యుత్తమ పర్‌ఫామెన్స్, పెద్ద బ్యాటరీ అందిస్తుంది. వివో X300 అద్భుతమైన కెమెరా సిస్టమ్ ఇస్తుంది. ఓప్పో రెనో 15 ప్రో మ్యాక్స్ ధర, ప్రీమియం ఫీచర్లలో బ్యాలెన్స్ చేస్తుంది. మీ ప్రాధాన్యం ఆధారంగా ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకోండి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×