ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన మే నెల రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నెల ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. గృహనిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. పుణ్య క్షేత్ర సందర్శనం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. మాసాంతమున శుభకార్యాలకు హాజరవుతారు. అవసరానికి ఏదోవిధంగా ధన సహాయం లభిస్తుంది.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగాల లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. చిన్నతరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. మాసాంతమున దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది.
ఈ నెలలో ఈ రాశి వారికి ధనాదాయం మార్గాలు పెరుగుతాయి. గృహమును శుభకార్యమూలకంగా ధనవ్యయం చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటుండదు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యత కలుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. మాసం ప్రారంభం లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆరోగ్యం సహకరిస్తుంది. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణిస్తారు. ఇంటాబయటా గౌరవ మర్యాదలకు లోటుండదు. గృహమున శుభకార్య నిర్వహణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. మాసం మధ్యలో ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ఈ నెలలో ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. మాసం చివర పరిస్థితులు కొంత వరకు అనుకూలిస్తాయి. ఆర్థికంగా సమస్యల నుంచి బయటపడతారు. మంగళవారం ఒకటింపావు కేజీ కందులు, గురువారం ఒకటింపావు కేజీ సెనగలు దానంగా ఇవ్వడం. వలన శుభ ఫలితాలను పొందుతారు.
ఈ నెలలో ఈ రాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికాక మానసిక ఆందోళనలు పెరుగుతాయి. మాసం మధ్యలో గృహమును ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మాసం చివరలో ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ధన సహాయం అందుక ఇబ్బంది పడతారు. కుటుంబ పెద్దల ఆరోగ్యం లో జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి. మాసం మధ్యనుండి కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు విస్తృతమౌతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల సహాయంతో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుతాయి. పదోన్నతులు పెరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపారస్థులకు విశేషమైన లాభాలు అందుతాయి. మాసం చివర నా ఇతరులు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఈ నెలలో ఈ రాశి వారు ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కుటుంబ సభ్యులు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. దూరపు బంధువులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. భాగస్వామి వ్యాపారాలలో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. భూ క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు అందుతాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు నుండి కొంత వరకు ఉపశమనం కలుగుతుంది మాసం మధ్యనుండి దూర ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో మందకొడిగా సాగుతాయి. ఇంటా బయట అకారణ వివాదాలు కలుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృతం అవుతాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. వివాదాలకు సంబంధించి ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వ్యవహారాలలో బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ కలలు సాకారం అవుతాయి. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి.
ఈ నెలలో ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని బాధ్యతలు వలన తగిన విశ్రాంతి లభించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు మానసికంగా తలచి వేస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడుల విషయంలో లోటు పాట్లు తప్పవు.