E-Paper
Advertisement

KCR : పెద్దాయనకు ఇబ్బందులు.. బాధపెట్టొద్దని రిక్వెస్ట్!

KCR : పెద్దాయనకు ఇబ్బందులు.. బాధపెట్టొద్దని రిక్వెస్ట్!
Advertisement

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పొలిటికల్ టెన్షన్స్ కంటే ఫ్యామిలీ టెన్షన్స్ ఎక్కువ అయినట్టు తెలుస్తోంది.ఆయన ప్రస్తుతం పార్టీ మీద ఫోకస్ పెట్టాలా? లేక కుటుంబం మీద ఫోకస్ పెట్టాలా? తెలియని అయోమయంలో ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. పదవులు, పంపకాల్లో తేడాల వల్లే కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయని.. కూతురు కల్వకుంట్ల కవిత బయటకు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు జరిగిన ఉద్యమంలో కవిత, కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్, మరికొందరు వీరి కుటుంబం నుంచి పోరాటాలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా.. కేటీఆర్ మంత్రి, హరీశ్ రావు మంత్రి, కవిత నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు.

పదేండ్ల పదవుల్లో పంపకాలు..

తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న ఒకే ఒక్క కారణంతో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. కేటీఆర్, హరీశ్ రావులను కేబినెట్‌లోకి తీసుకున్నారు. బిడ్డను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే కల్వకుంట్ల కేబినెట్ అవుతుందని ముందే భావించారేమో తెలిదు. అందుకే కవితకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇక జోగినిపల్లి సంతోష్ కుమార్‌ను రాజ్యసభకు పంపించారు. అప్పటికే కేసీఆర్ ప్రభుత్వంలో వారసులు భాగస్వామ్యం పంచుకోవడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కేసీఆర్‌ది కుటుంబ పాలన అని.. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తూ వచ్చాయి.

పదేళ్లలో పదవులు అనుభవించలేదా?..

Advertisement

తొలిటర్ములో కేసీఆర్ పాలన, సంక్షేమం ప్రజలను మెప్పించింది. దీంతో మరోసారి గులాబీ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. అయితే,కొంత వ్యతిరేకత కూడా కనిపించింది. ఎందుకంటే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా రెండోసారి కవిత పోటీ చేయగా.. స్థానికంగా ఆమె మీద వ్యతిరేకత పెరిగింది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడంలో ఆమె విఫలమయ్యారు. పసుపు పంటకు మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేయగా..నాడు స్థానిక ఎంపీగా ఉన్న కవిత ఏం చేయలేకపోయారు. దీంతో కవితకు ఓటర్లు షాక్ ఇచ్చారు. 2019 నాటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బీజేపీ గుర్తు మీద ధర్మపురి అర్వింద్ గెలిచారు. ఓటమి బాధను భరించలేక కవిత కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి సీఎం, సోదరుడు కేటీఆర్ మంత్రిగా, హరీశ్ రావు సైతం మంత్రిగా ఉన్నారు. తనకు పదవి లేదని కవిత బాధతో ఉండగా.. ఆమెను నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిపించారు కేసీఆర్..

Monthly Horoscope: మే నెల రాశి ఫలితాలు : ఆ రాశి ఉద్యోగులకు లాభాలు – రియల్టర్స్ కు నష్టాలు
తమ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఓ వైపు కేటీఆర్, మరోవైపు కవిత.. హరీశ్ రావులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు కాంగ్రెస్, బీజేపీ నేతలు పలుమార్లు ఆరోపించారు. తీరా 2023లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వెలుగులోకి వచ్చింది. అందులో కవిత నిందుతురాలిగా సీబీఐ ఆమె మీద అభియోగం మోపింది.ఈ క్రమంలోనే ఆరు నెలల పాటు ఆమె తిహార్ జైలులో నాలుగు గోడల మధ్య జీవితాన్ని గడిపారు. ఇక బెయిల్ మీద బయటకు వచ్చాక బీజేపీ, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ధిక్కార స్వరం పెంచారు. ఆ తర్వాత సొంత పార్టీ, సోదరుడు, బావ మీద అవినీతి ఆరోపణలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు సొంత పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఈ విషయం కేసీఆర్‌‌ను తీవ్రంగా బాధిస్తుందని తెలుస్తోంది.కాగా, పదవులు, పంపకాల్లో తేడాలు వచ్చాయని సొంత తండ్రిని కవిత తిట్టడం మంచి పద్ధతి కాదని.. ఆయనే లేకుంటే కేటీఆర్, కవితకు పదవులు వచ్చేవా? అని అధికార పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం విమర్శించిన విషయం తెలిసిందే.

Related News

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

కాంగ్రెస్ ను ఓడించేందుకు… బీజేపీ, బీఆర్‌ఎస్‌ రహస్య దోస్తానా? గ్రేటర్‌పై బీజేపీ పట్టు.. నల్లగొండపై గులాబీ పంతం..!

కేంద్ర మంత్రైనా… వాస్తవాలు చెప్పడంలో వెనక్కి రారు! మోడీ కేబినెట్‌లో ఉంటూనే జెన్‌జీ శక్తికి జై కొడతారు!

మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పైనా ఆరోపణలు..! ఆయనకు బ్యాంక్‌ చైర్మన్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు? కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన ప్రశాంత్‌ కిషోర్‌..

Big Stories

Advertisement
×