E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (14/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (14/11/2025) ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు 
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 14వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:  

రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పై  అధికారులతో  సమస్యలు రావొచ్చు.  ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  కుటుంబ సభ్యులతో  మాటపట్టింపులు ఉంటాయి.

వృషభ రాశి:

Advertisement

వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

మిథున రాశి:  

నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోదాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి.

కర్కాటక రాశి:

Advertisement

ఇంటాబయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆదాయమార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో  పూర్తిచేస్తారు.

సింహరాశి:

ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు  సందర్శిస్తారు.  వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపడతారు. వృత్తి  ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కన్యారాశి :

వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చూడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత ఋణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసి వస్తాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు  విజయం సాధిస్తారు. ఉద్యోగమున అందరితో సఖ్యతగా వ్యవహరించిన  ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

వృశ్చికరాశి:

వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి. ఇంటాబయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన  మానసికంగా బాధిస్తుంది.

ధనస్సు రాశి:

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు  నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు.

మకరరాశి:

వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున  మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహనిర్మాణ   పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి  సైతం ధన సహాయం చేస్తారు.

కుంభరాశి:

ఆర్థిక వ్యవహారాలు ఆశజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.  కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మీనరాశి:

నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. ఉద్యోగస్తులకు చిన్న పాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడుతాయి.

 ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×