E-Paper
Advertisement

OTT Movie : గర్భిణీలే ఈ సైకో టార్గెట్… పోలీస్ భార్యను కూడా వదలకుండా… ఇంటెన్స్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : గర్భిణీలే ఈ సైకో టార్గెట్… పోలీస్ భార్యను కూడా వదలకుండా… ఇంటెన్స్ కన్నడ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : కన్నడ సినిమాలు కూడా మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ లతో వస్తున్నాయి. ‘కె జి యఫ్’ ‘కాంతార’ సినిమాలకు ముందు, ఈ ఇండస్ట్రీ సినిమాలకు బయట పెద్దగా ఆదరణ ఉండేది కాదు. ఇటీవలి కాలంలో ఈ సినిమాలు అటు థియేటర్లలో, ఇటు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఇటీవల కమరో 2, ఎలుమలే, దూర తీరా యానా, కపట నాటక సూత్రధారి, హెబ్బులి కట్ వంటి సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ లో మంచి వ్యూస్ తో నడిచాయి. ఈ నేపథ్యంలో ‘ఉసిరు’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ ఈ ఏడాది ఆగస్టులో థియేటర్లలో విడుదలై, పాజిటివ్ టాక్ తో నడిచింది. గర్భిణీ స్త్రీల హత్యల ఇన్వెస్టిగేషన్ తో మొదలయ్యే ఈ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్ ని పక్కాగా ఇస్తుంది. డిజిటల్ స్ట్రీమింగ్ కి డేట్ కూడా ఫిక్స్ అయింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా పర్ఫెక్ట్ మ్యాచ్. ఇది ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

పనేం ప్రభాకర్ తొలిసారి దర్శకత్వం వహించిన కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఉసిరు’. ఇందులో తిలక్ శేఖర్ ప్రధాన పాత్రలో నటించగా, ప్రియా హెగ్డే, సంతోష్ నదివాడ, బాల రాజ్‌వాడి, రాఘు రామనకొప్ప మిగతా పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్ట్ లో థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు మూడు నెలల తరువాత 2025 నవంబర్ 21న Sun NXTలో స్ట్రీమింగ్ అవ్వబోతోంది.

Advertisement

Read Also : బాయ్ ఫ్రెండ్‌తో బర్త్ డే పార్టీకి వెళ్తున్నారా ? ఈ మూవీ మీకోసమే… మిస్సింగ్ ట్విస్ట్‌తో మతిపోగోట్టే టర్నులు

కథ ఏమిటంటే

ఈ స్టోరీ రెండు కథలతో మొదలవుతుంది. మొదటి కథలో ఒక హత్యాయత్నం కేసులో జైలు పాలైన సూర్య అనే యువకుడు, జైలు వార్డెన్ కంట్లో పడతాడు. ఆ వార్డెన్ అతనికి జైలులో ఒక గురువులా వ్యవహరిస్తాడు. కొంతకాలానికి క్రమశిక్షణతో విడుదలైన సూర్య ఒక ప్రమాదకరమైన రివేంజ్ కి కట్టుబడి ఉంటాడు. తన తల్లిదండ్రుల హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు. అదే మార్గంలో అడుగులు వేస్తాడు. ఇక రెండో కథలో అదే సమయంలో కొత్తగా రాజ్ అనే పోలీస్ ఆఫీసర్ బదిలీ అవుతాడు. గర్భిణీ స్త్రీలు అక్కడ వరుసగా హత్యలకు గురవుతుంటారు. ఈ కేసును రాజ్ దర్యాప్తు చేయడం ప్రారంభిస్తాడు. ఈ గర్భిణీ స్త్రీల హత్యలు ఒక నిర్దిష్ట తేదీలలో జరుగుతుంటాయి.  రాజ్ భార్య కూడా ఈ సమయంలో ప్రెగ్నెంట్ గా ఉంటుంది. కిల్లర్ టార్గెట్ రాజ్ భార్య మీద కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసును ఛేదించే క్రమంలో హత్యల వెనుక ఒక షాకింగ్ సీక్రెట్ బయటికి వస్తుంది. చివరికి ఈ రెండు కథలు ఊహించని మలుపులతో కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్ లో సూర్య రివేంజ్ తీర్చుకుంటాడా ? రాజ్ కిల్లర్ ని పట్టుకుంటాడా ? రాజ్ భార్య కూడా కిల్లర్ కి బలవుతుందా ? ఈ రెండు స్టోరీలకు ఉన్న లింకు ఏమిటి ? అనే విషయాలను, ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.

Advertisement

 

 

 

Related News

ఏం సిరీస్ రా అయ్యా… రక్తం ఏరులై పారే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్

అమాయకపు దొంగను అడ్డం పెట్టుకుని ఇవేం పాడు పనులు… ఈ తమిళ మిస్టరీ థ్రిల్లర్ క్లైమాక్స్ హైలెట్

40 ఏళ్ల వయసులో పట్టే పిచ్చి… ఫ్యామిలీ ఫ్యామిలీకి నెంబర్ల శాపం… కట్ చేస్తే గజగజా వణికిపోయే ట్విస్ట్

సైనికుడిని సొంత ప్రభుత్వమే ఉగ్రవాదిగా ముద్రవేస్తే… మెంటల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్

శబరిమల కొండల్లో కొడుకు మిస్సింగ్… ఎమోషనల్ తమిళ ఫ్యామిలీ డ్రామా

పెళ్ళయిన వ్యక్తితో ప్రేమ… ఓటీటీలోకి వచ్చేసిన ట్రయాంగిల్ రొమాంటిక్ డ్రామా

కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా

ఘనంగా నెక్సా ఓటీటీ అకాడమీ అవార్డ్స్ వేడుక.. సత్తా చాటిన తెలుగు కుర్రాడు!

Big Stories

Advertisement
×