Jubilee Hills Bypoll Results:
సమయం మధ్యాహ్నం 1:15 జూబ్లీహిల్స్ బైపోల్ లో ఈవీఎం ఓట్లను లెక్కిస్తున్నారు. భారీ ఆధిక్యం మెజారిటీతో నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. ఇప్పటివరకు ఒక్క మూడో రౌండ్ లో తప్ప కాంగ్రెస్ ఎక్కడా తగ్గలేదు. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ చాలా స్వల్ప ఆధిక్యం వచ్చింది. భారీ ఆధిక్యంతో హస్తం పార్టీ దూసుకుపోతోంది. అటు పోస్టల్ బ్యాలెట్ లోనూ కాంగ్రెస్ కు ఆధిక్యం వచ్చిన విషయం తెలిసిందే. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యింది మొత్తం 10 రౌండ్లు పూర్తి అయ్యాయి. ఓవరాల్ గా కాంగ్రెస్ 24,658 ఓట్ల ఆధిక్యంతో విక్టరీ సాధించింది.
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలు
ఎనిమిదో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 21,495 ఓట్ల మెజార్టీతో ముందంజ
రెండో స్థానంలో బీఆర్ఎస్
సమయం: మధ్యాహ్నం 12 గంటలు
ఏఢో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 19619 ఓట్ల ఆధిక్యంలో ముందంజ
రెండో స్థానంలో బీఆర్ఎస్
https://twitter.com/bigtvtelugu/status/1989213104107110512
సమయం: ఉదయం 11:30 గంటలు
ఆరో రౌండ్ ముగిసే సరికి 15,589 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ (భారీ ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గాంధీ భవన్ లో ఇప్పటికే పండుగ వాతావరణం నెలకొంది.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తున్న మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ముఖ్య నేతలు
ఒక్కో రౌండ్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ కనబరుస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు… pic.twitter.com/z7joe2n0f4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
సమయం: ఉదయం 11 గంటలు
ఐదో రౌండ్ ముగిసే సరికి.. 12,651 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్
గెలుపు దిశగా నవీన్ యాదవ్..
ఇంకో ఐదు రౌండ్స్ మాత్రమే మిగిలిఉన్నాయి. భారీ ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలవబోతున్నారని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
సమయం: ఉదయం 10:30 గంటలు
నాలుగో రౌండ్ ముగిసే సరికి 9వేల ఆధిక్యంలో నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో యూసుఫ్‌గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు భారీ మెజారిటీ రావడంతో డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అభినందిస్తున్న ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు#JubileeHillsByElection pic.twitter.com/QcXmhclCHi
— BIG TV Breaking News (@bigtvtelugu) November 14, 2025
సమయం: ఉదయం 10 గంటలు
మూడో రౌండ్‌లో బీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం
నవీన్ యాదవ్: 12292 ఓట్లు
మాగంటి సునీత: 12,503 ఓట్లు
నోట్: ఓవరాల్ గా ఆధిక్యంలో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
ఉదయం 9:30 గంటలకు..
నవీన్ యాదవ్: 18617
మాగంటి సునీత: 17473
దీపక్ రెడ్డి: 307
నోట్: 1144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్..
ఉదయం 9 గంటల వరకు..
నవీన్ యాదవ్: 8926
మాగంటి సునీత: 8864
దీపక్ రెడ్డి: 11
జూబ్లీహిల్స్ బైపోల్ కౌంటింగ్ ప్రారంభమైంది. యూసఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో భారీ భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. మొత్తం 10 రౌండ్లలో, 42 టేబుళ్లపై కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి టేబుల్‌కు ప్రత్యేకంగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేశారు. మొత్తం 186 మంది సిబ్బంది పాల్గొన్నారు. ప్రసెంట్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంల లెక్కింపు మొదలు కానుంది.
ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరుగనుంది. మొత్తం ప్రక్రియ రెండు నుంచి మూడు గంటల్లోనే పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉపఎన్నికలో 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున…ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టే చాన్స్ ఉంది. సో ఆ లెక్కన మధ్యాహ్నం 2గంటలకల్లా తుది ఫలితం వచ్చే అవకాశ ఉంది.
ఈ ఎన్నికల్లో బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒక్కటి కూడా రాలేదు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లేకపోవడంతో ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా ఇందులో 101 మంది ఓటు వేయగా ఇద్దరు మరణించారు. ఆ తరువాత ఈవీఎంలో ముందుగా షేక్‌పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్ల కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎలాం అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఫలితాన్ని అప్‌లోడ్ చేయనున్నారు. ఫలితాల అప్డేట్స్ కోసం ఈ లైవ్ పేజీ చూడండి.