E-Paper
Advertisement

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/11/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం – ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/11/2025) ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం –  ఆ రాశి ఉద్యోగులకు సమస్యలు
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ 30వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

 వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు. బంధువులతో అకారణంగా మాట పట్టింపులుంటాయి. దూరప్రయాణాల వలన శ్రమ అధికమౌతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందదు. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వృషభం

Advertisement

 సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. 

మిథునం

దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్య పరంగా చికాకులు తప్పవు. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగమున మీ కష్టం ఫలించదు.

కర్కాటకం

Advertisement

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ముందడుగు వేస్తారు. స్నేహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

సింహం

 బందు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వృత్తి ఉద్యోగాలు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభాకార్య విషయాలపై  చర్చలు చేస్తారు.

కన్య

కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణాలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

 వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. చిన్న పాటి అనారోగ్యం సమస్యలు బాధిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బందు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రెండు రకములైన ఆలోచన వలన ధన నష్టాలు తప్పవు.

వృశ్చికం

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు పొందుతారు.  నూతన వాహనం కొనుగోలు చేస్తారు.  వృత్తి వ్యాపారాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

ధనుస్సు

గృహ నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల మౌతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

మకరం

నూతన ఋణ ప్రయత్నాలు ఫలించవు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రాబడికి మించి ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని ఇబ్బందులుంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

కుంభం

ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు తప్పవు చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో విఫలమౌతారు. సన్నిహితుల నుండి ఊహించని విమర్శలు ఎదురవుతాయి.  ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

మీనం

ఉద్యోగాలు ఆశాజకనంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు పొందుతారు. వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం అందుతుంది. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమౌతాయి.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×